Crime news | కొడుకు హిందూ బాలికను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని ముస్లిం తల్లిదండ్రుల దారుణ హత్య
Crime news | ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఘోరం జరిగింది. అబ్బాస్, కమ్రూల్ నిషా అనే ముస్లిం దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వారి కుమారుడు షౌకత్.. రూబీ అనే హిందూ బాలికను తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం ఈ జంట హత్యలకు దారి తీసింది.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఘోరం జరిగింది. అబ్బాస్, కమ్రూల్ నిషా అనే ముస్లిం దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వారి కుమారుడు షౌకత్.. రూబీ అనే హిందూ బాలికను తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం ఈ జంట హత్యలకు దారి తీసింది. రూబీ తండ్రి రాంపాల్ మరో నలుగురు వ్యక్తులతో కలిసి షౌకత్ ఇంటిపై దాడి చేశాడు. ఇంట్లో ఉన్న అతని తల్లిదండ్రులను ఇనుప రాడ్లు, కర్రలతో దారుణంగా కొట్టి చంపారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రూబీ తండ్రి రాంపాల్ సహా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కాగా, షౌకత్, రూబీ కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉంటున్నాయి. దాంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. రూబీ పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో 2020లో ఇద్దరూ లేచిపోయారు.
దీనిపై రూబీ తండ్రి రాంపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికి రూబీ మైనర్ కావడంతో పోలీసులు షౌకత్ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన షౌకత్.. ఇప్పుడు రూబీ మేజర్ కావడంతో మరోసారి లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఆగ్రహించిన రూబీ కుటుంబసభ్యులు షౌకత్ పేరెంట్స్‌పై దాడి చేసి హతమార్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

