ఇంఫాల్: మణిపూర్లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడ్ని (Manipur main culprit) వీడియో ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. నగ్నంగా ఉన్న ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మాస్క్ లేకుండా వీడియోలో కనిపించిన వ్యక్తిని 32 ఏళ్ల హుయిరేమ్ హిర్దోస్ మైతీగా పేర్కొన్నారు. పేచీ అవాంగ్ లైకై ప్రాంతానికి చెందిన నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు గురువారం వెల్లడించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
కాగా, బి ఫైనోమ్ గ్రామంలో కర్రలు వంటి ఆయుధాలు చేతపట్టిన సుమారు 800 మంది మైతీ వర్గానికి చెందిన వారు, గిరిజన వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. వారిపై సామూహిక లైంగిక దాడికి కూడా పాల్పడ్డారు. మే 4న జరిగిన ఈ హేయమైన సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ బుధవారం సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇది కలకలం రేపింది.
మరోవైపు ఈ దారుణ సంఘటనపై చలించిపోయిన సుప్రీంకోర్టు కేంద్రానికి చీవాట్లు పెట్టింది. మణిపూర్లో ఆందోళనలు కూడా వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు స్పందించారు. గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రధాన నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు. మిగతా వారి అరెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ హామీ ఇచ్చారు.
Manipur | The main culprit who was wearing a green t-shirt and seen holding the woman was arrested today morning in an operation after proper identification. His name is Huirem Herodas Meitei (32 years) of Pechi Awang Leikai: Govt Sources
(Pic 1: Screengrab from viral video, Pic… pic.twitter.com/e5NJeg0Y2I
— ANI (@ANI) July 20, 2023