Ulta Rath Yatra | జగన్నాథ ఉల్టా యాత్రలో అపశ్రుతి..! విద్యుత్ షాక్‌తో చిన్నారులు సహా ఏడుగురు దుర్మరణం
Ulta Rath Yatra | జగన్నాథ స్వామి ఉల్టా రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకున్నది. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన త్రిపుర ఉనాకోటి జిల్లాలో బుధవారం జరిగింది. కుమార్‌ఘాట్‌లో సాయంత్రం జగన్నాథుడి ‘ఉల్టా రథయాత్ర’ జరిగింది.
Ulta Rath Yatra | జగన్నాథ స్వామి ఉల్టా రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకున్నది. ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన త్రిపుర ఉనాకోటి జిల్లాలో బుధవారం జరిగింది. కుమార్‌ఘాట్‌లో సాయంత్రం జగన్నాథుడి ‘ఉల్టా రథయాత్ర’ జరిగింది. ఇటీవల జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం ఉల్టా రథయాత్ర చేపట్టారు. వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో జనం ఇనుముతో చేసిన రథాన్ని జనం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ హైటెన్షన్ వైర్లను రథం తాకింది.
దాంతో ఒక్కసారిగా విద్యుద్ఘాతంతో మంటలు చెలరేగాయి. విద్యుత్ షాక్‌తో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి మాణిక్ సాహా సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి అగర్తల నుంచి కుమార్‌ఘాట్‌కు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

