UGC | న్యూఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలు, ప్రొవిజినల్ సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ముద్రించొద్దని యూనివర్సిటీలను యూజీసీ ఆదేశించింది. ఇకపై సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ప్రింట్ చేయడంపై నిషేధం విధించింది.
నిబంధనల ప్రకారం.. ఆధార్ నంబర్‌ను పబ్లిక్‌గా బహిర్గతం చేయకూడదని యూజీఏసీ సెక్రటరీ మనీష్ జోషి యూనివర్సిటీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. డిగ్రీలు, ప్రొవిజినల్ సర్టిఫికెట్ల మీద ఆధార్ నంబర్లు ప్రింట్ చేస్తే, అవి అనుమతించబడవు అని స్పష్టం చేశారు. యూఏడీఏఐ నిబంధనలను ఉన్నత విద్యాసంస్థలు కచ్చితంగా ఫాలో కావాలని సూచించారు.
అయితే ప్రవేశాలు, రిక్రూట్మెంట్ల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ నంబర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీలు అభ్యర్థుల డిగ్రీలు, ప్రొవిజినల్స్‌పై ఆధార్ నంబర్లు ముద్రిస్తున్నారు. ఇది సరికాదని యూజీసీ తేల్చిచెప్పింది.