Students Electrocuted | వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న విద్యార్థులు.. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి
Students Electrocuted | ప్రభుత్వ హాస్టల్లోని వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో ఇద్దరు స్టూడెంట్స్ అక్కడికక్కడే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆ హాస్టల్ వద్ద నిరసన చేపట్టారు.
భోపాల్: ప్రభుత్వ హాస్టల్లోని వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. (Students Electrocuted) దీంతో ఇద్దరు స్టూడెంట్స్ అక్కడికక్కడే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆ హాస్టల్ వద్ద నిరసన చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సర్దార్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లోని ప్రభుత్వ గిరిజన హాస్టల్‌కు చెందిన 12వ తరగతి విద్యార్థులు బుధవారం వాటర్ ట్యాంక్‌ను క్లీన్ చేశారు. అయితే ఆ ట్యాంకులోకి నీటిని తోడే మోటారు విద్యుత్ వైర్ వారికి తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు విద్యార్థులు మరణించారు. మృతులను వికాస్ నినామా, ఆకాష్ నినామాగా గుర్తించారు.
కాగా, ఈ విషయం తెలిసిన ఆ విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆ ప్రభుత్వ హాస్టల్ వద్ద నిరసనకు దిగారు. వాటర్ ట్యాంక్ శుభ్రం చేయమని విద్యార్థులకు ఎవరు చెప్పారని నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు సర్దార్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ గ్రేవాల్ కూడా ఆ హాస్టల్ వద్దకు చేరుకున్నారు. ఈ సంఘటనపై స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వెల్ సింగ్ భూరియాతో ఆయన వాగ్వాదానికి దిగారు. అయితే విద్యార్థుల మృతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేత భూరియా ఆరోపించారు.
అక్కడకు చేరుకున్న పోలీసులు హాస్టల్ వద్ద పరిస్థితిని అదుపు చేశారు. విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

