teacher molested teen for 9 years | తొమ్మిదేళ్లుగా బాలికపై లైంగిక దాడులు, వేధింపులు.. కీచక టీచర్ అరెస్ట్
Tuition teacher molested teen for 9 years | ఒక టీచర్ తొమ్మిదేళ్లుగా బాలికపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడ్డాడు (Tuition teacher molested teen for 9 years). ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. అయితే తోటి విద్యార్థుల చొరవతో బాధిత యువతి నోరు విప్పింది.
ముంబై: ఒక టీచర్ తొమ్మిదేళ్లుగా బాలికపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడ్డాడు (Tuition teacher molested teen for 9 years). ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. అయితే తోటి విద్యార్థుల చొరవతో బాధిత యువతి నోరు విప్పింది. దీంతో ఆ కీచక టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ దారుణ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక కుటుంబం చాలా ఏళ్ల కిందట ముంబైకి వలస వచ్చింది. అయితే భర్తను భార్య విడిచిపెట్టింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి తన పిల్లలతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తున్నాడు.
కాగా, ఆ వ్యక్తి తొమ్మిదేళ్ల కిందట ఆరేళ్ల వయసున్న కుమార్తెను పొరుగున ఉన్న ట్యూషన్లో చేర్చించాడు. అయితే ట్యూషన్ టీచర్ నాటి నుంచి ఆ బాలికను లైంగికంగా వేధించడంతోపాటు ఆమెపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. అలాగే స్కూల్‌కు పంపిస్తే చెడ్డ స్నేహాలు ఏర్పడతాయని బాలిక తండ్రిని నమ్మించాడు. ఆమెను స్కూలుకు వెళ్లకుండా చేసి నిత్యం తన ట్యూషన్‌కు రప్పిస్తున్నాడు. ఆ బాలికపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. బాలికకు పిరియడ్స్ వచ్చిన తర్వాత గర్భం రాకుండా ట్యాబెట్లు కూడా ఇవ్వసాగాడు.
ప్రస్తుతం16 ఏళ్ల వయసున్న ఆ బాలిక ఆ ట్యూషన్లో పదో తరగతి చదువుతున్నది. గత మూడేళ్లుగా ఆమె స్కూలుకు వెళ్లడం లేదు. బాలిక తండ్రి కొన్ని రోజుల కిందట వ్యక్తిగత పని మీద బెంగాల్ వెళ్లాడు. ఈ సమయంలో ట్యూషన్ టీచర్ నిత్యం ఆ యువతిపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు.
కాగా, స్కూల్ స్నేహితులు ఇటీవల ఆ యువతిని కలిశారు. ఆమె స్కూల్‌కు ఎందుకు రావడం లేదని ఆరా తీశారు. అలాగే ట్యూషన్ టీచర్ ఆ యువతిని చూసి వెకిలిగా నవ్వడాన్ని వారు గమనించారు. ఏం జరిగిందో చెప్పాలని ఆమెను బలవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఆ యువతి చివరకు నోరు విప్పింది. ట్యూషన్ టీచర్ గత తొమ్మిదేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నట్లు చెప్పింది. దీంతో వారంతా కలిసి ఈ విషయాన్ని ఆమె తండ్రి దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు బాధిత బాలిక, ఆమె తండ్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ కీచక టీచర్‌పై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం 55 ఏళ్ల వయసున్న ట్యూషన్ టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

