రాయ్‌పూర్: చత్తీస్ఘడ్(Chhattisgarh)లో హై స్పీడ్ చేజింగ్ ఘటన చోటుచేసుకున్నది. ట్రక్కుతో అతి వేగంగా వెళ్తున్న డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు సుమారు 60 కిలోమీటర్ల దూరం చేజింగ్ చేశారు. ఆ ఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి. మోహలా-మాన్పూర్-అంబాఘర్ రూట్లో ఈ చేజింగ్ సీన్ జరిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతున్నది. మహారాష్ట్ర బోర్డర్‌కు మరో 6 కిలోమీటర్ల దూరంలో ఛేజింగ్ ముగిసింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ తొలుత ఓ గ్రామం వద్ద 11 ఏళ్ల అమ్మాయిపై నుంచి ట్రక్కును తీసుకెళ్లాడు. గుండర్దేహి గ్రామం వద్ద పూనమ్ అనే అమ్మాయిని ట్రక్కుతో ఢీకొట్టాడు.
मोहला-मानपुर जिले में शुक्रवार को एक शराबी ट्रक चालक ने बच्ची को रौंदने के बाद भागते हुए तीन थानों की पुलिस को छकाया। अंतत: 60 किमी दूर जाकर पकड़ा गया। @MMACDistrict_CG #Chhattisgarh #TruckDriver pic.twitter.com/aiI37j80kR
— Haribhoomi (@Haribhoomi95271) June 26, 2026
కానీ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం వద్ద ఆగకుండా డ్రైవర్ పారిపోయాడు. మొహలా దిశగా ఆ ట్రక్కు వెళ్లింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఆ ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించారు. తొలుత మొహలా పోలీసు స్టేషన్ వద్ద బారికేడ్‌ను నిర్మించారు. కానీ ఆ ట్రక్కు డ్రైవర్ ఆ బారికేడ్ల మీద నుంచే దూసుకెళ్లాడు. పోలీసులు ఆ ట్రక్కును ఛేజ్ చేశారు. మాన్పుర్ ఎస్డీఎం ఆఫీసు వద్ద మరో బారికేడ్ పెట్టారు. కానీ ఆ బారికేడ్లను కూడా నెట్టేసుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత మాన్పుర్ పట్టణంలోకు అతడు ప్రవేశించాడు. ఈ చేజింగ్ సమయంలో పోలీసు సిబ్బంది తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నది.
CHHATTISGARH HORROR A speeding truck brutally crushed an innocent child to death in Gunderdehi village (Mohla-Manpur)
Instead of stopping, the ruthless driver smashed through multiple police barricades & fled across border toward Maharashtra A massive manhunt is underway. 💔🚛 pic.twitter.com/CDkmvyb7nt— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) June 26, 2026
అయితే మహారాష్ట్ర బోర్డర్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో కార్కొట్టి గ్రామం వద్ద ట్రక్కు అదుపు తప్పి ఆగిపోయింది. గాయపడ్డ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి మాన్పుర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఉన్న ట్రక్కు, ట్రక్కు డ్రైవర్‌పై కేసు బుక్ చేశారు.
छत्तीसगढ़ के राजनांदगांव में दिल दहला देने वाला हादसा सामने आया है।
मोहला-मानपुर जिले के गुंडरदेही गांव में दुस्साहस की वारदात
तेज रफ्तार ट्रक ने एक बालिका को कुचल दिया, जिसके बाद गुस्साए लोगों ने 55 KM तक ट्रक का पीछा किया,फिर चेकपोस्ट पर पुलिस को भी कुचलने का प्रयास किया… pic.twitter.com/ctdEhNI7zv
— Abhishek Dwivedi /अभिषेक द्विवेदी 🇮🇳 (@Dubeyjilive) June 27, 2026