Man Rapes Students | వాయిస్ యాప్ ద్వారా మహిళా ప్రొఫెసర్‌గా నమ్మించి.. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం
Man Rapes Students | ఒక వ్యక్తి వాయిస్ యాప్ ద్వారా మహిళా ప్రొఫెసర్‌గా విద్యార్థినులతో మాట్లాడాడు. స్కాలర్షిప్ పొందేందుకు సహాయం చేస్తానని నమ్మించాడు. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు, అతడికి సహకరించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
భోపాల్: ఒక వ్యక్తి వాయిస్ యాప్ ద్వారా మహిళా ప్రొఫెసర్‌గా విద్యార్థినులతో మాట్లాడాడు. స్కాలర్షిప్ పొందేందుకు సహాయం చేస్తానని నమ్మించాడు. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు, అతడికి సహకరించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. (Man Rapes Students) మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బ్రజేష్ కుష్వాహా నిరక్షరాస్యుడు. అయితే సాంకేతిక పరిజ్ఞానంతో కాలేజీ అమ్మాయిలను టార్గెట్ చేశాడు.
కాగా, తన వాయిస్ మార్ఫింగ్ చేసే యాప్‌ను బ్రజేష్ వినియోగించాడు. మహిళా ప్రొఫెసర్ గొంతుతో గిరిజన కాలేజీ విద్యార్థినులతో మాట్లాడాడు. స్కాలర్షిప్ పొందేందుకు సహాయం చేస్తానని వారిని నమ్మించాడు. తాను పంపే వ్యక్తిని కలవాలని చెప్పాడు. అనుచరులు తీసుకువచ్చిన ఆ విద్యార్థినులను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
మరోవైపు ఒక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు హెల్మెట్ ధరించడంతో గుర్తించలేదని చెప్పింది. అయితే అతడి చేతికి గ్లౌవ్స్ ధరించినట్లు క్లూ ఇచ్చింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు బ్రజేష్ కుష్వాహా, అతడి ముగ్గురు సహచరులను శనివారం అరెస్ట్ చేశారు. గతంలో మహారాష్ట్రలోని మిల్లులో అతడు పని చేసినప్పుడు చేతులకు కాలిన గాయాలయ్యాయని, అందుకే అతడు గ్లౌవ్స్ ధరిస్తున్నాడని తెలిపారు. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు.
కాగా, నిందితుడు బ్రజేష్ కుష్వాహా మరింత మంది అమ్మాయిలను టార్గెట్ చేశాడా అన్నది దర్యాప్తు చేసేందుకు 9 మంది పోలీసులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఆదేశించారు. అలాగే సిద్ధి జిల్లా యంత్రాంగం బుల్డోజర్ ద్వారా బ్రజేష్ ఇంటిని కూల్చివేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Madhya Pradesh
- MAN
- Pose
- rapes
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

