భోపాల్: ఎయిర్ షో చూసేందుకు ఒక షాపు టాప్‌పైకి జనం ఎక్కారు. (Bhopal Air Show) అయితే వారి బరువుకు తట్టుకోలేక ఆ షాపు రూఫ్ కూలిపోయింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 91వ వార్షికోత్సవం సందర్భంగా భోపాల్‌లోని భోజ్తాల్ సరస్సుపై వైమానిక ప్రదర్శన నిర్వహించారు. చినూక్ హెలికాప్టర్లతోపాటు పలు యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి.
కాగా, ఈ ఎయిర్ షో చూసేందుకు జనం పోటెత్తారు. ఈ సందర్భంగా ఒక చిన్న షాపు టాప్‌పైకి స్థానికులు పెద్ద సంఖ్యలో ఎక్కారు. దీంతో వారి బరువు తట్టుకోలేక ఆ రూఫ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది గాయపడ్డారు. స్థానికులు కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video | Tin roof of shop collapses as people climb to watch Bhopal air show
Read here: https://t.co/7jYEyVg7Ei pic.twitter.com/NSgpAjwtrP
— NDTV (@ndtv) September 30, 2023