Teeth | టోక్యో, జూలై 9: దంతాలు ఊడిపోయాయని బాధ పడుతున్నారా? పెట్టుడు పళ్లతో ఇబ్బంది పడుతున్నారా? ఏమీ తినలేక అవస్థలు పడుతున్నారా? అయితే మీ కష్టాలు త్వరలో గట్టెక్కనున్నాయి. పండ్లు ఊడిపోయి అవస్థలు పడుతున్న పెద్దలకు జపాన్ శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు.
ఊడిపోయిన పెద్దల పళ్లను మళ్లీ పెరిగేలా చేసే ఓ ఔషధాన్ని తయారు చేస్తున్నట్టు క్యోటో యూనివర్సిటీ, ఫుకుయి యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. సంబంధిత అధ్యయన ఫలితాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. యూఎస్ఏజీ-1 ప్రోటీన్ కారణంగా పెద్దల దంతాలు తిరిగి పెరగడం లేదని పరిశోధకులు గుర్తించారు. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో దంతాల పెరుగుదలపై యూఎస్ఏజీ-1 ప్రోటీన్ ప్రభావాన్ని నివారించే ఓ ఔషధాన్ని కనుగొన్నారు.