లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై అకృత్యాలు కొనసాగుతున్నాయి. వావీ వరసలు, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మూడో తరగతి చదువుతున్న చిన్నారిపై తొమ్మిదో తరగతి విద్యార్థి అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఫతేపూర్‌లో జరిగింది.
ఫతేగఢ్ జిల్లాలోని ఫతేపూర్‌లో ఓ 9 ఏండ్ల చిన్నారి మూడో తరగతి చదువుతున్నది. ఆమెపై తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏండ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.