లక్నో: పొలంలో పని చేసుకునే కుటుంబం వద్దకు తాంత్రికుడు వెళ్లాడు. ఆకలిగా ఉందని వారితో చెప్పాడు. తినేందుకు ఎదైనా తెచ్చేందుకు పెద్దలు వెళ్లగా ఒంటరిగా ఉన్న బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికంగా వేధించాడు. తన కుటుంబానికి ఆమె చెప్పడంతో వారు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ తాంత్రికుడ్ని చితకబాదారు. (Tantrik Brutally Thrashed) ఉత్తరప్రదేశ్లోని మోహన్లాల్గంజ్లో ఈ సంఘటన జరిగింది. తాంత్రికుడు మేకు లాల్ బాబా కొన్నేళ్లుగా భూతవైద్యం చేస్తున్నాడు. గ్రామం వెలుపల ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. ఆ గ్రామంలో కొంత భూమి కూడా అతడికి ఉంది.
కాగా, శుక్రవారం పొలాల్లో పంటలు కోసే కాంట్రాక్టు పని తీసుకున్న దంపతుల వద్దకు ఆ బాబా వెళ్లాడు. తనకు ఆకలిగా ఉందని తినేందుకు ఏదైనా ఇవ్వమని అడిగాడు. దీంతో ఆ దంపతులు 11 ఏళ్ల కుమార్తెను ఇంట్లో వదిలి సమోసాలు తెచ్చేందుకు వెళ్లారు. ఆ తర్వాత బాబా ఆ బాలికను తన గుడిసెలోకి తీసుకెళ్లాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
మరోవైపు ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని ఆ బాలిక చెప్పింది. ఇది తెలిసి ఆ కుటుంబంతోపాటు గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. కర్రతో ఆ బాబాను చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ తాంత్రికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాబాను చితకబాదిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
पिटने वाले साधु बाबा का नाम है मैकूलाल रावत। आरोप है कि इसने एक मासूम बच्ची के प्राइवेट पार्ट में उंगली डालकर गंदी हरकत की। बच्ची की फैमिली वालों ने साधु को लाठियों से पीटा और पुलिस को सौंप दिया। मामला उत्तर प्रदेश की राजधानी लखनऊ का है। pic.twitter.com/u8fZJCzPMM
— Sachin Gupta (@SachinGuptaUP) October 26, 2024