Another saint death | కర్ణాటకలో మరో సాధువు అనుమానాస్పద మృతి
Saint Death | కర్ణాటకలో మరో సాధువు మృతి కలకలం రేపింది. రెండు నెలల క్రితం బెల్గాంలో ఓ సాధువు అనుమానాస్పద స్థితిలో చనిపోగా.. ప్రస్తుతం రామనగరలోని మఠంలో బసవలింగ స్వామి తన గదిలో శవమై కనిపించాడు.
Saint Death | కర్ణాటకలో ఇటీవల ఓ సాధువు అనుమానాస్పద మృతిని మరిచిపోక ముందే మరో సాధువు మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. రామనగర జిల్లాలోని శ్రీ కంచగుల్ మఠానికి చెందిన సంత్ బసవలింగ స్వామి కన్నుమూశారు. మఠంలోని ఓ గదిలో సాధువు శవమై కనిపించడంతో కలకలం చెలరేగింది. ఆ గదిలో రెండు పేజీల నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ కుదూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రెండు నెలల క్రితం బెల్గాంలోని శ్రీ గరు మడివళేశ్వర మఠంలోని బసవ సిద్ధలింగ స్వామి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే.
కర్ణాటకలో మరో సాధువు మృతిచెందారు. రామనగరలోని శ్రీ కంచగుల్ మఠాధిపతి సంత్ బసవలింగ స్వామి తన గదిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండగా మఠం సిబ్బంది గుర్తించారు. సోమవారం ఉదయం దర్శనం కోసం వచ్చిన భక్తులు మఠం తలుపులు తెరవకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టగా సాధువు మరణం బయటపడింది. సమాచారం అందుకున్న కుదూర్ పోలీసులు స్వామిజీ మృతదేహాన్ని దవాఖానకు తరలించి సాధువు గదిలో రెండు పేజీల నోట్‌ను స్వాధీనపర్చుకన్నారు. పరువు తీస్తామంటూ కొంత మంది వ్యక్తులు బెదిరిస్తున్నట్లు ఆ నోట్లో స్వామీజీ రాసినట్లుగా సమాచారం. అతి పురాతనమైన ఈ మఠంలో గత 25 సంవత్సరాలుగా బసవలింగ స్వామి దర్శనమిస్తున్నారు. రామనగర పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి సాధువు మృతిపై దర్యాప్తు ప్రారంభించారు.
కర్ణాటక బెల్గాంలోని శ్రీ గురు మడివళేశ్వర మఠంలో రెండు నెలల క్రితం బసవ సిద్దలింగ స్వామి మృతదేహం లభ్యమైంది. శిష్యులు మఠం గదిని తెరిచి చూడగా సిద్దలింగం మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. లింగాయత్ మఠంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆడియోలో తన పేరు కనిపించడంపై ఆ స్వామీజీ కలత చెంది ఉంటాడని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

