Supertech Twin Towers | సుప్రీం కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నాం : సూపర్ టెక్
Supertech Twin Towers | నోయిడాలోని సూపర్ టెక్ ట్విన్ టవర్స్‌ను అధికారులు అన్ని జాగ్రత్తల మధ్య ఆదివారం కూల్చివేశారు. భవనాల కూల్చివేతకు ముందు సూపర్ టెక్ ప్రకటన విడుదల చేసింది. టవర్ల నిర్మాణానికి 2009లో నోయిడా అథారిటీ ఆమోదించిందని, నోయిడా అథారిటీకి పూర్తి చెల్లింపులు చేసిన తర్వాత టవర్ల నిర్మాణం చేపట్టామని పేర్కొంది. అయితే, ‘సాంకేతిక కారణాలతో నిర్మాణం సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు గుర్తించి, రెండుటవర్లను ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామని, అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటనలో పేర్కొంది.
ఎత్తయిన భవనాలు సురక్షితంగా కూల్చివేయడంలో నైపుణ్యం కలిగిన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎడ్ఫిన్ ఇంజినీరింగ్‌కు బాధ్యతలు అప్పగించాం’ అని కంపెనీ పేర్కొంది. తాము 70వేల మందికిపైగా ఫ్లాట్లను సిద్ధం చేసి ఇచ్చామని, మిగతా వారికి సైతం గడువులో ఇస్తామని కంపెనీ తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఇతర ప్రాజెక్టులు ఏవీ ప్రభావితం కాబోవని, ప్రాజెక్టులన్నీ కొనసాగుతాయని వినియోగదారులకు హామీ ఇస్తున్నట్లు చెప్పింది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసి, కేటాయించిన వారికి ఫ్లాట్లను పంపిణీ చేసేందుకు కట్టుబడి ఉన్నామని కంపెనీ స్పష్టంచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

