Watch: చిన్నారిపై ఎద్దు దాడి.. క్రిటికల్‌గా ఆరోగ్య పరిస్థితి
Stray bull | నాలుగేళ్ల బాలిక ఇంటి బయట నిల్చొని ఉంది. ఇంతలో ఒక ఎద్దు ఆ వీధిలో వెళ్తున్నది. పాపను చూసిన ఆ ఎద్దు పరుగున ఆమె వద్దకు వెళ్లింది. పాపను కొమ్ములతో పొడిచి కాళ్ళతో తొక్కేసింది. దీంతో ఆ చిన్నారి ఎగిరి నేలపై పడింది.
లక్నో: ఒక పాపపై ఎద్దు (Stray bull) దాడి చేసింది. ఆ చిన్నారిని కాళ్లతో తొక్కేయడంతోపాటు కొమ్ములతో కుమ్మేసింది. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఆ పాప ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది. ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. థానా గాంధీ పార్క్ ప్రాంతంలోని ధనిపూర్ మండి వద్ద నాలుగేళ్ల బాలిక ఇంటి బయట నిల్చొని ఉంది. ఇంతలో ఒక ఎద్దు ఆ వీధిలో వెళ్తున్నది. పాపను చూసిన ఆ ఎద్దు పరుగున ఆమె వద్దకు వెళ్లింది. పాపను కొమ్ములతో పొడిచి కాళ్ళతో తొక్కేసింది. దీంతో ఆ చిన్నారి ఎగిరి నేలపై పడింది.
కాగా, ఎద్దు దాడిని గమనించిన ఒక వ్యక్తి పరుగున ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఎద్దు కింద ఉన్న పాపను బయటకు తీశాడు. ఇంతలో మరో వ్యక్తి కూడా స్కూటర్‌పై అక్కడకు చేరుకున్నాడు. గాయపడిన ఆ పాపను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు ఈ సంఘటన వల్ల స్థానికులు భయాందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు స్పందించారు. సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ పశువును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని ఒక ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిన్నారిపై ఎద్దు దాడి చేయడం చూసి నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. మున్సిపల్ సిబ్బంది స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
https://twitter.com/akramaajtak/status/1633736421092753409?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1633736421092753409%7Ctwgr%5E5036e2cc033ee9330bfc7345b584cc33c9a4917a%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.lokmatnews.in%2Fweird%2Fbull-gores-4-year-old-child-in-aligarh-video-goes-viral-b628%2F
Video: రైలు ఇంజిన్‌పై చనిపోయిన చిరుత.. వీడియో వైరల్
చిరు వ్యాపారులపై బీజేపీ బుల్డోజరిజం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

