కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్ష(Shiranthi Rajapaksa) సతీమణి, మాజీ ఫస్ట్ లేడీ షిరన్తి రాజపక్షను ఇవాళ ఆ దేశ అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు చెందిన ఎన్జీవో సిరిలియా సవియా బ్యాంక్ అకౌంట్‌ను సీజ్ చేశారు. కొలంబో శివారులో ఉన్న పొలెంగొడలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 73 ఏళ్ల షిరన్తి రాజపక్ష సోమవారమే సింగపూర్ నుంచి చేరుకున్నారు. వైద్య చికిత్స కోసం ఆమె విదేశాలకు వెళ్లారు. ఆర్ధిక నేరాల శాఖ అరెస్టును అడ్డుకునేందుకు ఆమె తరపున లాయర్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
షిరన్తి స్థానిక స్టేట్ బ్యాంక్ నుంచి సుమారు 10 మిలియన్ల రుణం తీస్తున్నారు. కానీ ఆ డబ్బును దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. సిరిలియ సవియా ఫౌండేషన్ గురించి కూడా ఆర్థిక నేర విభాగం దర్యాప్తు చేస్తున్నది. 2005 నుంచి 2015 వరకు సిరిలియా ఫౌండేషన్ నడిచింది. షిరన్తి పెద్ద కుమారుడు నమల్ రాజపక్ష ప్రస్తుతం విపక్ష పార్టీలో ఉన్నారు. రెండు లంచం కేసుల్లో కొలంబో జైలులో ఉన్నారు.