ఏసీలో చుట్టుకుని పడుకున్న కొండ చిలువ..!
Python in AC: ఎయిర్ కండిషనర్‌లో కొండచిలువ చుట్టుకుని పడుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్నది.

న్యూఢిల్లీ: ఎయిర్ కండిషనర్‌లో కొండచిలువ చుట్టుకుని పడుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్నది. ఢిల్లీలోని ఛతార్పూర్ ఏరియాలోగల ఓ ఇంట్లో ఏసీ మొరాయించింది. దాంతో కుటుంబసభ్యులు ఏం జరిగిందో చూద్దామని ఆ ఏసీ డోర్ తెరిచి షాకయ్యారు. ఎందుకంటే అందులో రెండు అడుగుల పొడవుగల ఇండియన్ రాక్ పైథాన్ పిల్ల పడుకుని ఉన్నది. వెంటనే విషయాన్ని పాములను రక్షించే స్వచ్ఛంద సంస్థకు తెలియజేయగా వారు ఇద్దరు సిబ్బందిని ఘటనా ప్రాంతానికి పంపించారు. వాళ్లు దాదాపు 45 నిమిషాలపాటు శ్రమించి కొండచిలువను వెలికితీశారు. ఆ తర్వాత సమీప అటవీ ప్రాంతంలో దాన్ని వదిలేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

