Watch: ఫుడ్ స్టాల్లోకి దూసుకెళ్లిన కారు.. గాల్లోకి ఎగిరిపడిన మహిళ
Car Rams Into Eatery | అదుపుతప్పిన ఒక కారు ఫుడ్ స్టాల్లోకి దూసుకెళ్లింది. (Car Rams Into Eatery) ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక మహిళ గాల్లోకి ఎగిరిపడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చెన్నై: అదుపుతప్పిన ఒక కారు ఫుడ్ స్టాల్లోకి దూసుకెళ్లింది. (Car Rams Into Eatery) ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక మహిళ గాల్లోకి ఎగిరిపడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని వెల్లూరులో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 11న ఒక వ్యక్తి నిద్రమత్తులో కారు డ్రైవ్ చేశాడు. స్పీడ్ బ్రైకర్ను గమనించకుండా వేగంగా నడిపాడు. ఈ నేపథ్యంలో అదుపుతప్పిన ఆ కారు రోడ్డు పక్కగా ఉన్న ఈటరీలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న సాయీషా అనే మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె గాల్లోకి ఎగిరి ఆ ఫుడ్‌స్టాల్ లోపల పడింది. గాయపడిన ఆమెకు స్థానికులు చికిత్స అందించారు.
కాగా, కారు డ్రైవ్ చేసిన వ్యక్తిని కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. గత రెండు రోజులుగా సరిగా నిద్రపోని అతడు నిద్ర మత్తులో కారును నడిపినట్లు తెలిపారు. స్పీడ్ బ్రేకర్ వద్ద వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఫుడ్ స్టాల్‌వైపు దూసుకెళ్లిందని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆ ఈటరీ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
तमिलनाडु के वेल्लोर में ड्राइवर को आया नींद का झोंका, दुकान में जा घुसी कार।
इस दौरान दुकान में मौजूद एक महिला को गंभीर चोट आई है।
घटना CCTV कैमरे हुई कैद।#TamilNadu #viralvideo #viral #Accident #CarAccident pic.twitter.com/4WXVk0PuPA
— The Hint News (@TheHintNews) February 15, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- car
- driver
- eatery
- Flung Into Air
RELATED ARTICLES
తాజా వార్తలు
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
INDIA bloc | ఇండియా బ్లాక్ ర్యాలీతో మాకు సంబంధం లేదు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వెల్లడి
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

