Sheikh Hasina: మళ్లీ బంగ్లాదేశ్‌కు వెళ్లనున్న షేక్ హసీనా.. ఎప్పుడంటే
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో కొత్త సర్కారు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశం వెళ్తుందని ఆమె కుమారుడు తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో సోమవారం దేశాన్ని విడిచి హసీనా భారత్‌లో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో కొత్త సర్కారు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) స్వదేశం వెళ్తుందని ఆమె కుమారుడు తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో సోమవారం దేశాన్ని విడిచి హసీనా భారత్‌లో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉన్న హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ మాట్లాడుతూ.. తన తల్లి ప్రస్తుతం ఇండియాలో ఉన్నదని, ఎన్నికలు నిర్వహించేందుకు ఎప్పుడు కొత్త సర్కారు సిద్ధంగా ఉంటే అప్పుడు ఆమె స్వదేశం వెళ్తుందన్నారు.
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్కారులో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ సభ్యులు ఎవరూ లేరు. ప్రస్తుతం హసీనా ఢిల్లీలో ఓ సురక్షితమైన ఇంట్లో ఉంటున్నారు. బ్రిటన్‌లో ఆశ్రయం పొందాలని ఆమె భావించినా, ఆమె అభ్యర్థనను ఆ దేశం తిరస్కరించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ విషయం గురించి బ్రిటన్ సర్కారుతో మాట్లాడినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. అయితే ఆయన పూర్తి వివరాలను వెల్లడించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

