Secret Meeting | శరద్ పవార్, అజిత్ రహస్య భేటీ.. ఎన్సీపీ నేతలు ఏమన్నారంటే?
Secret Meeting | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవర్, ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ శనివారం రహస్యంగా సమావేశమయ్యారు (Secret Meeting). పూణె కోరేగావ్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఒక వ్యాపారవేత్త నివాసంలో వారిద్దరూ కలుసుకున్నారు.
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవర్, ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ శనివారం రహస్యంగా సమావేశమయ్యారు (Secret Meeting). పూణె కోరేగావ్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఒక వ్యాపారవేత్త నివాసంలో వారిద్దరూ కలుసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంటకు కారులో ఆ ఇంటికి వచ్చిన శరద్ పవార్ సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి తిరిగి వెళ్లారు. అనంతరం సాయంత్రం 6.45 గంటలకు అజిత్ పవార్ మీడియా కంటపడకుండా అక్కడి నుంచి జారుకున్నారు.
ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త ఇంట్లో రహస్యంగా కలుసుకున్న శరద్ పవార్, అజిత్ పవార్ సుమారు ఐదు గంటలపాటు ఏం మాట్లాడుకున్నారు అన్నదానిపై సస్పెన్స్ నెలకొన్నది. మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరుగుతాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కాగా, ఇదేమీ రహస్య మీటింగ్ కాదని ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ మీడియాతో ఆదివారం అన్నారు. అజిత్ పవార్‌తో కలిసి తాను కూడా అక్కడికి వెళ్లినట్టు తెలిపారు. అయితే తాను త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య ఏం సంభాషణ జరిగిందో అన్నది తనకు తెలియదన్నారు. అలాగే ఎన్సీపీ చీలిపోలేదని, తమ అధినేత శరద్ పవార్ అని మరోసారి స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

