క్లాస్‌లో స్కూల్ డ్రెస్ విప్పించిన టీచర్… నిప్పంటించుకుని విద్యార్థిని ఆత్మహత్యా యత్నం
ఈ సంఘటనను వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. విద్యార్థిని డ్రెస్ విప్పించి అవమానించిన ఆ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాంచీ: ఒక విద్యార్థినితో బలవంతంగా క్లాస్‌లో స్కూల్ యూనిఫామ్‌ను టీచర్ విప్పించింది. దీంతో అవమానంగా భావించిన ఆ బాలిక నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 9వ తరగతి చదువున్న బాలిక క్లాస్‌లో పరీక్షలు రాస్తున్నది. అయితే ఆ విద్యార్థిని వద్ద కాపీ చీటీలు ఉన్నట్లు మహిళా ఇన్విజిలేటర్ అనుమానించింది. పక్కన ఉన్న మరో క్లాస్ రూమ్‌లోకి ఆ బాలికను తీసుకెళ్లింది. బలవంతంగా స్కూల్ యూనిఫామ్‌ను విప్పించి తనిఖీ చేసింది.
కాగా, ఈ సంఘటనను ఆ విద్యార్థిని అవమానంగా భావించింది. పరీక్ష అనంతరం ఇంటికెళ్లిన తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన బాలిక తల్లి, స్థానికులు ఆమెను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు ఈ సంఘటనపై బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థిని స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఆ ఉపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ సంఘటనను వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. విద్యార్థిని డ్రెస్ విప్పించి అవమానించిన ఆ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఓయూ, కేయూ వర్సిటీల పూర్వ విద్యార్థుల జాతీయ భావజాల సమ్మేళనానికి ఆహ్వానం’
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

