నేపాల్ చరిత్రకారుడు సత్యమోహన్ జోషి కన్నుమూత
Satyamohan Joshi: నేపాల్ చరిత్రకాడురు, సాహిత్యవేత్త సత్యమోహన్ జోషి ఇకలేరు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న 103 ఏండ్ల
ఖాట్మండు: నేపాల్ చరిత్రకాడురు, సాహిత్యవేత్త సత్యమోహన్ జోషి ఇకలేరు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న 103 ఏండ్ల జోషి.. ఖాట్మండులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు జోషిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జి చేశారు. కానీ డెంగీ ఫీవర్ రావడంతో ఇటీవల మళ్లీ ఆస్పత్రిలో చేర్పించారు.
వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి సత్యమోహన్ జోషికి గుండె సమస్య, డెంగీ ఫీవర్‌తోపాటు న్యుమోనియా కూడా ఉన్నట్లు తేల్చారు. సంబంధిత చికిత్స కొనసాగుతుండగానే ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కాగా, జోషి మృతికి నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం సంతాపం ప్రకటించింది. జోషి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
సత్యమోహన్ జోషి 1919లో లలిత్‌పూర్‌లోని పటాన్‌లో జన్మించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే గొప్ప చరిత్రకారుడిగా, సాహిత్యకారుడిగా పేరు సంపాదించారు. ఆయన నేపాల్ చరిత్ర, సాహిత్యం, సంస్కృతికి సంబంధించి 60కి పైగా పుస్తకాలు రాశారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా నేపాల్ ప్రభుత్వం ఆయనను పలు పురస్కారాలతో సత్కరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
Trivikram | ప్రభాస్‌లో ఆ యాంగిల్‌ను ఎవరూ చూపించలేదు.. త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

