Home
National
Russian Paraglider Pilot Rescued After Getting Trapped In High Tension Wires In Himachal Pradesh
200 అడుగుల ఎత్తులో మృత్యువుతో పోరాటం
హిమాచల్ ప్రదేశ్‌లో ఉత్కంఠ భరిత ఘటన చోటుచేసుకుంది. పారాైగ్లెడింగ్ చేస్తూ అదుపుతప్పిన ఓ రష్యా పైలట్ ఏకంగా 200 అడుగుల ఎత్తులో 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగల్లో చిక్కుకున్నాడు.
- విద్యుత్ తీగల్లో రష్యన్ పైలట్ విలవిల
మండీ : హిమాచల్ ప్రదేశ్‌లో ఉత్కంఠ భరిత ఘటన చోటుచేసుకుంది. పారాైగ్లెడింగ్ చేస్తూ అదుపుతప్పిన ఓ రష్యా పైలట్ ఏకంగా 200 అడుగుల ఎత్తులో 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగల్లో చిక్కుకున్నాడు. మూడు గంటల పాటు గాలిలోనే వేలాడుతూ ప్రాణభయంతో గడిపాడు. చివరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా చేపట్టిన సహాయక చర్యలతో అతడిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు.
మండీ-పధార్ హైవేపై టాండు సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పారాైగ్లెడింగ్ కేంద్రం బీర్ బిల్లింగ్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు పైలట్ గాల్లో ఎగిరాడు. అయితే కొద్దిసేపటికే నియంత్రణ కోల్పోయి, హైటెన్షన్ విద్యుత్ తీగల్లో చిక్కుకున్నాడు. ఎస్డీఆర్ఎఫ్ జవాన్ నవీన్ కుమార్ పైలెట్ వద్దకు చేరుకుని అతడిని సురక్షితంగా కిందకు తీసుకురావడంలో సహకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

