Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Revolt brews in NC | జమ్ముకశ్మీర్‌లోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)లో తిరుగుబాటు వ్యవహారం కలకలం రేపుతున్నది. 19 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రివర్గం ప్రక్షాళనతో పాటు సీఎం ఒమర్ సహాయకులను తొలగించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)లో తిరుగుబాటు వ్యవహారం కలకలం రేపుతున్నది. 19 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. (Revolt brews in NC) మంత్రివర్గం ప్రక్షాళనతో పాటు సీఎం ఒమర్ సహాయకులను తొలగించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించారు. శుక్రవారం సాయంత్రం శ్రీనగర్‌లోని ఎమ్మెల్యే ఖైసర్ జంషెద్ లోన్ నివాసంలో 19 మంది అసంతృప్త ఎన్సీ ఎమ్మెల్యేలు సుమారు నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలో భారీ మార్పులు చేయాలని, పార్టీ, పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలపై ఒమర్‌కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు సహాలదారులను తొలగించాలన్న తమ డిమాండ్లపై వారు చర్చించారు.
కాగా, పదవిలో రెండేళ్లు పూర్తి చేసుకున్న మంత్రులందరినీ తొలగించాలని, యోగ్యత, సమతుల్య ప్రాంతీయ ప్రాతినిధ్యం ఆధారంగా మంత్రి పదవులను పునఃపంపిణీ చేయాలని అసమ్మతి ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పార్టీ వ్యవహారాలు, పరిపాలనా నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ, పార్టీ నాయకుడు నాసిర్ అస్లాం వానీ, పార్లమెంట్ సభ్యుడు షమ్మీ ఒబెరాయ్, ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరితో సహా మరికొందరు మంత్రులను పదవుల నుంచి తొలగించాలని కోరుతూ ఒక సంయుక్త తీర్మానాన్ని ఆమోదించారు.
మరోవైపు ఎన్సీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లాకు ఈ తీర్మానాన్ని సమర్పించనున్నట్లు ఆ వర్గం తెలిపింది. ‘మేము మా డిమాండ్లను తెలియజేయడానికి ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నాం. మేం పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ ఇకపై పాత పద్ధతుల్లోనే వ్యవహారాలు కొనసాగకూడదు. ఆయన (ముఖ్యమంత్రి) మా మాట వినాలి. పార్టీ, ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా తగిన మార్పులు చేయాలి’ అని ఒక అసంతృప్తి ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అయితే మరో ఆరుగురు ఎన్సీ ఎమ్మెల్యేలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తున్నది. అసంతృప్త వర్గానికి తమ మద్దతును వారు తెలియజేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఎన్సీ తిరుగుబాటు వర్గంలో 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు లెక్క తేలింది. ఈ నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లాకు తీవ్ర సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.
కాగా, 90 మంది సభ్యులున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కు 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

