జీతం 10 వేలు.. ఖాతాలో లక్ష కోట్లు!
ఒక మెడికల్ పాయింట్లో రూ.10 వేల జీతానికి పనిచేసే యువకుడి బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ.లక్ష కోట్లు కన్పించడంతో అతడు షాకయ్యాడు.
సికార్ : ఒక మెడికల్ పాయింట్లో రూ.10 వేల జీతానికి పనిచేసే యువకుడి బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ.లక్ష కోట్లు కన్పించడంతో అతడు షాకయ్యాడు. రాజస్థాన్‌లోని సికార్‌లో 22 ఏండ్ల సమీర్ ఖాన్ బుధవారం మొబైల్ రీచార్జి చేసేందుకు బ్యాంకింగ్ యాప్ తెరచి తన ఖాతాలో ఏకంగా లక్ష కోట్ల రూపాయల మొత్తం ఉన్నట్టు చూసి షాక్ తిన్నాడు. అంతే కాకుండా ఆ నిధుల ఉపసంహరణపై ఆంక్షలు విధించినట్టు గుర్తించాడు.
దీంతో ఖాతాలో ఉన్న రూ.55 వేల సొమ్మును కూడా ఆయన ఉపయోగించుకోలేక పోయాడు. తన యజమానికి విషయాన్ని తెలిపాడు. ఆయనతో కలిసి సైబర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వారి సూచన మేరకు బ్యాంక్‌ను సంప్రదించగా, సాంకేతిక లోపం కారణంగానే అంత మొత్తం అతని ఖాతాలో జమైనట్టు చూపించిందని చెప్పిన అధికారులు అతని ఖాతాను సరిచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

