Rajasthan police: కేంద్ర మంత్రికి నోటీసులు ఇచ్చిన రాజస్థాన్ పోలీసులు
Rajasthan police: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు రాజస్థాన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బ్యాంకు అకౌంట్లతో పాటు ఆర్థిక లావాదేవీలకు చెందిన సమాచారాన్ని ఇవ్వాలని రాజస్థానీ పోలీసులు కోరినట్లు మంత్రి తెలిపారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ రాజకీయ కక్షకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు.
జైపూర్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు రాజస్థాన్ పోలీసులు(Rajasthan police) నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. బ్యాంకు అకౌంట్లతో పాటు ఆర్థిక లావాదేవీలకు చెందిన సమాచారాన్ని ఇవ్వాలని రాజస్థానీ పోలీసులు కోరినట్లు మంత్రి తెలిపారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ రాజకీయ కక్షకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. జోధ్‌పూర్‌లోని ఇంటికి నోటీసులు ఇచ్చారని, తనకు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి అని, అంతకుముందు తనకు ఎటువంటి నోటీసులు రాలేదని ఎంపీ షెకావత్ తెలిపారు. సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో మంత్రి గజేంద్ర పాత్ర ఉన్నట్లు సీఎం గెహ్లాట్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు ఈ కేసును విచారిస్తున్నది. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, రాజకీయ కుట్రతో తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని కేంద్ర జలశక్తి మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో సీఎం గెహ్లాట్‌పై కేంద్ర మంత్రి పరువునష్టం కేసును దాఖలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెచ్చిపోతున్న మందుబాబులు.. గాల్లో దీపంగా అమాయకుల ప్రాణాలు!
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
Vishwak Sen | ప్రీమియర్స్ వేస్తే ‘సైంటిస్టులు’ వచ్చేస్తారు.. పెయిడ్ రివ్యూలపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
Sircilla | పరిహారం పొందిన భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఎలా?.. ప్రజావాణిలో దేశాయిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

