Indian Railway | టికెట్ల ధరలను పెంచిన భారతీయ రైల్వే.. నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి..!
Indian Railway | భారతీయ రైల్వే టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెంచిన టికెట్ల ధరలు జులై ఒకటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. టికెట్ల ధరల పెంపుపై రైల్వే బోర్డు అన్ని జోన్లకు సర్క్యూలర్‌ను జారీ చేసింది. రైలు చార్జీల పెంపు మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు వర్తించనున్నది.
Indian Railway | భారతీయ రైల్వే టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెంచిన టికెట్ల ధరలు జులై ఒకటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. టికెట్ల ధరల పెంపుపై రైల్వే బోర్డు అన్ని జోన్లకు సర్క్యూలర్‌ను జారీ చేసింది. రైలు చార్జీల పెంపు మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు వర్తించనున్నది. పెరిగిన ధరలు జులై ఒకటి నుంచి అమలులోకి వస్తాయని ఇప్పటికే రైల్వే బోర్డు ప్రకటించింది. రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పెరిగిన ఛార్జీ జనరల్, స్లీపర్, ఏసీ క్లాస్‌లకు వర్తించనున్నది. ఏసీ చైర్ క్లాస్, ఏసీ త్రీ టైర్, త్రీ టైర్ ఎకానమీ, ఏసీ టూ టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో కిలోమీటరుకు 2 పైసలు పెంచుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
నోటిఫికేషన్ ప్రకారం, ఏసీ కోచ్‌లతో పాటు, నాన్-ఏసీ కోచ్‌ల ఛార్జీ కూడా పెరిగింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సెకండ్, స్లీపర్, ఫస్ట్ క్లాస్ నాన్-ఏసీ కోచ్‌ల ఛార్జీని కిలోమీటరుకు ఒక పైసా పెరిగింది. జనరల్ క్లాస్‌లో కిలోమీటరుకు అర పైస పెంపు ఉంటుంది. జనరల్ కోచ్‌లో సెకండ్ క్లాస్ ఆర్డినరీలో 500 కిలోమీటర్ల వరకు చార్జీల పెంపు ఉండదని రైల్వేశాఖ తెలిపింది. 501 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల వరకు రూ.5.. ఇక 1501 కిలోమీటర్ల నుంచి 2055 కిలోమీటర్ల వరకు రూ.10 పెరగనుండగా.. 2501 కిలోమీటర్ల నుంచి 3వేల కిలోమీటర్ల వరకు రూ.15 చార్జీ పెంచింది. మరో వైపు ఫస్ట్‌క్లాస్, స్లీపర్ క్లాస్‌లో కిలోకు మీటర్‌కు అరపైసా పెరిగింది. అయితే, స్థానిక, సీజనల్ టికెట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. స్థానిక రైళ్లు, ఎంఎస్టీ హోల్డర్ల ప్రయాణికులకు రైల్వే ఉపశమనం కల్పించింది. రైల్వేలు సబర్బన్, సీజన్ టిక్కెట్ల ఛార్జీలను పెంచలేదు. ఎంఎస్టీ, క్యూఎస్‌టీ ప్రయాణికులపై పెరిగిన చార్జీల ప్రభావం ఉండదని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. రైల్వే పరిధిలోని అన్ని ప్రీమియం రైళ్లలో టికెట్ల ధరలు పెరిగాయి. తేజస్, రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, హమ్‌సఫర్, అమృత్ భారత్, మహామన, గతిమాన్, అంత్యోదయ, గరీబ్ రథ్, జన శతాబ్ది, యువ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లలో సాధారణ సర్వీసుల (నాన్-సబర్బన్), అనుభూతి కోచెస్, ఏసీ విస్టాడోమ్ కోచ్‌లలో తరగతి వారీగా చార్జీలను సవరించింది. ఈ చార్జీలు జులై ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, జూన్ 30వ తేదీ వరకు బుక్ చేసుకున్న టికెట్ల ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదని.. ఒకటి తర్వాత ప్రయాణం చేసినా ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి. పెరిగిన చార్జీలు జులై ఒకటి నుంచి బుక్ చేసుకునే టికెట్లకే వర్తిస్తుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

