Rahul Gandhi | విపక్ష కూటమిపై మోదీ విమర్శలకు రాహుల్ కౌంటర్
విపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తోసిపుచ్చారు. తమను ప్రధాని మోదీ ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చని కానీ తాము మాత్రం మణిపూర్ గాయం మానేందుకు సాయపడతామని, అల్లర్లతో అట్టుడికిన రాష్ట్ర పునర్నిర్మాణానికి పాటుపడతామని అన్నారు.
న్యూఢిల్లీ : విపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తోసిపుచ్చారు. తమను ప్రధాని మోదీ ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చని కానీ తాము మాత్రం మణిపూర్ గాయం మానేందుకు సాయపడతామని, అల్లర్లతో అట్టుడికిన రాష్ట్ర పునర్నిర్మాణానికి పాటుపడతామని అన్నారు. విపక్షాలను మోదీ ఏ పేరుతోనైనా పిలవచ్చు..మోదీజీ మేము ఇండియా..! దేశ ప్రజలందరిలో ప్రేమ, ప్రశాంతత తిరిగి తీసుకొస్తామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
విపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఈస్టిండియా కంపెనీ వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. విపక్షాలు ఇండియా అని పేరుపెట్టుకుంటే మోదీ ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. పట్నా, బెంగళూర్‌లో ప్రతిపక్షాలు విజయవంతంగా సమావేశాలు నిర్వహించడంతో బీజేపీలో వణుకు మొదలైందని అన్నారు.విపక్షాలు ఏకం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీకి దిక్కుతోచడం లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌కు వచ్చి మణిపూర్ అల్లర్లపై మాట్లాడాలని తాము ప్రధాని నరేంద్ర మోదీని కోరితే ఏం మాట్లాడాలి..ఏం చేయాలనే దానిపై ప్రధానికి పాలుపోవడం లేదని అన్నారు.
మణిపూర్ ఘటనలపై పార్లమెంట్ వెలుపల మాట్లాడిన మోదీ పార్లమెంట్ లోపల ఈ విషయంపై సమగ్ర చర్చ చేపట్టి అక్కడి పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు వివరించాలని ఖర్గే డిమాండ్ చేశారు. మణిపూర్ వ్యవహారాన్ని రాజస్ధాన్, చత్తీస్ఘఢ్, పశ్చిమ బెంగాల్ వంటి బీజేపేయేతర రాష్ట్రాల్లో జరిగిన ఘటనలతో పోల్చలేమని చెప్పారు. దేశంలో ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ మణిపూర్ అల్లర్లు ఆందోళన రేకెత్తిస్తాయని అన్నారు. మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి కాషాయ పాలకులకు పట్టడం లేదని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖేలో ఇండియా గేమ్స్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించండి
హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ కొనసాగింపు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

