రేపు డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో… పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ సింగ్ గురువారం పెళ్లి చేసుకోనున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో రెండో వివాహం జరుగనున్నది. చండీగఢ్‌లోని ఆయన నివాసంలో జరుగనున్న ఈ ప్రైవేట్ వేడుకకు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకానున్నారు.
కాగా, సీఎం భగవంత్ మాన్ సింగ్‌కు ఇది వరకు ఇందర్‌ప్రీత్ కౌర్‌తో పెళ్లయింది. 2014లో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే ఆరేళ్ల వివాహ బంధం తర్వాత మొదటి భార్య ఇందర్‌పీత్ర్ కౌర్, ఆయన విడిపోయారు. భగవంత్ మాన్కు తొలి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.
పంజాబ్ ఎన్నికల్లో ఆప్ అనూహ్యంగా విజయం సాధించింది. దీంతో భగవంత్ మాస్ సింగ్ సీఎం అయ్యారు. మరోవైపు ఆయన మరో పెళ్లి చేసుకోవాలని తల్లి, సోదరి సూచించారు. వారిద్దరికి తెలిసిన వైద్యురాలు గురుప్రీత్ కౌర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. దీంతో గురువారం చండీగఢ్‌లోని భగవంత్ మాన్ సింగ్ నివాసంలో గురుప్రీత్ కౌర్‌తో ఆయన రెండో పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రైవేటుగా జరుగనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Response | నమస్తే తెలంగాణ కథనానికి స్పందన.. కాల్వకు మరమ్మతులు ప్రారంభం
Vijay Sethupathi | సూపర్ డీలక్స్ కాంబో వన్స్‌మోర్.. విజయ్ సేతుపతి నుంచి క్రేజీ అప్డేట్
తుంగతుర్తిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
‘బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి’
తెలంగాణ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట డిపో నూతన కమిటీ ఎన్నిక
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

