Watch: మద్యం మత్తులో వాహనం నడిపిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Pune woman police constable | పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ మద్యం సేవించి కారు నడిపింది. మద్యం మత్తులో ఆ వాహనంపై నియంత్రణ కోల్పోయింది. కొందరు వ్యక్తులతో ఆమె వాదించడంతో పాటు దురుసుగా ప్రవర్తించింది. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో ఆ మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.
ముంబై: పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ మద్యం సేవించి కారు నడిపింది. మద్యం మత్తులో ఆ వాహనంపై నియంత్రణ కోల్పోయింది. కొందరు వ్యక్తులతో ఆమె వాదించడంతో పాటు దురుసుగా ప్రవర్తించింది. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో ఆ మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. (Pune woman police constable) మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 26న పోలీస్ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ అశ్విని ఫుల్‌చంద్ కేకన్, మద్యం సేవించి కారు నడిపింది. ఆ మత్తులో వాహనంపై ఆమె నియంత్రణ కోల్పోయింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు ఆమెను నిలదీశారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ మహిళా కానిస్టేబుల్ వారితో వాగ్వాదానికి దిగడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడింది.
కాగా, ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుంభార్, ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ మహిళా కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. మహిళా కానిస్టేబుల్ అశ్వినికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. దీంతో మంజరి పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు చేశారు. అలాగే పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఆమెను సస్పెండ్ చేశారు.
#Pune: A woman police constable was caught driving drunk on the wrong side of the road in Pune’s Manjari early Tuesday. The car reportedly had no number plate. After videos went viral, Pune Police initiated steps to register an FIR and suspend her. #Watch https://t.co/zCgbtlm1OP
— Varad Bhatkhande | Journalist (@VaradBhatkhande) October 28, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- caught
- drunk driving
- Pune
- suspended
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: మద్యం మత్తులో వాహనం నడిపిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
PM Modi | దేశం కష్టాల్లో ఉంటే విపక్షాలకు సంతోషం.. ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు..!
BRS Protest | భూత్పూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ ధర్నా
ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించాలి : అదనపు కలెక్టర్ విద్యా చందన
Dhanu-Dinu | సోషల్ మీడియా వేధింపులు.. ‘ది ట్రైటర్స్’ నటుడు ధనుంజయ్‌పై నటి పోలీసు ఫిర్యాదు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

