Janata Dal Return | తిరిగి జనతాదళ్ ఆవిర్భావం..? ఒక్కటి కానున్న ఆర్జేడీ, జేడీయూ..!
Janata Dal Return | బిహార్లో రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేందుకు లాలూ కుటుంబం, నితీష్ కుమార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండు పార్టీలు ఒక్కటై తిరిగి జనతాదళ్గా వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి.
Janata Dal Return | బిహార్లో కొత్త రాజకీయ ముఖచిత్రం ఆవిష్కృతమవుతున్నది. 28 ఏండ్ల క్రితం నాటి రాజకీయం తిరిగి తెరపైకి రానున్నది. ఇన్నాళ్లు ఎడమొగం పెడమొగంగా ఉన్న రాజకీయ అగ్రగణ్యులు ఇప్పుడు చేతులు కలుపుతున్నారు. దీంతో బిహార్లో రాజకీయం కొత్త మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే, బిహార్లో బీజేపీకి గడ్డు రోజులు తప్పవని చెప్పవచ్చు.
తొమ్మిదేండ్ల కాలంలో బిహార్ రాజకీయ చిత్రం చాలాసార్లు మారిపోయింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేసే పార్టీలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలిసి మనుగడ సాగించలేకపోయాయి. ఎవరు ఎవరికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేస్తారో, ప్రభుత్వం ఏర్పడేందుకు ఎవరితో కలిసి నడుస్తారో అన్నది ఆలోచనకు కూడా అందదు. అయితే ఈసారి బిహార్ రాజకీయాలలో చాలా మార్కులు చోటు చేసుకోనున్నాయి. గత నెల క్రితం వరకు బద్ధ శత్రువులుగా ఉన్న ఆర్జేడీ, జేడీయూలు చేతులు కలిపి బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. రానున్న రోజుల్లో ఈ మైత్రిని మరింత దృఢంగా చేసేందుకు రెండు పార్టీలు కలిసిపోయి.. పాత జనతాదళ్ను తిరిగి ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు చర్చలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో రెండు పార్టీలు ఒక్కటయ్యే అవకాశం ఉన్నది.
బిహార్ రాజకీయాలను శాసించిన లాలూ ప్రసాద్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఒకటి కానున్నాయి. ఇదే జరిగితే, బిహార్ కమాండ్ తేజస్వి యాదవ్ చేతుల్లోకి వెళ్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మారనున్నారు. ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా చేసి ఆ పదవిలో తేజస్విని కూర్చుండబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో పార్టీ గుర్తు, జెండా మార్పుపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయం బిహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు పార్టీల కలయికపై పార్టీ సీనియర్లు మాత్రం ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. జనతాదళ్ నుంచి వేరుపడిన నితీష్ కుమార్.. 1994 లో సొంతంగా సమతాపార్టీని ఏర్పాటుచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

