PM Modi | ప్రముఖ నటుడు నానా పటేకర్ (75) మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేవలం నటనలోనే కాకుండా, సమాజంలో తన నిక్కచ్చితనానికి, నమ్మిన సిద్ధాంతాల కోసం నిర్భయంగా మాట్లాడే వ్యక్తిగా ఆయన(Nana Patekar) ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారని మోదీ గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం సినీ ప్రపంచానికి తీరని లోటన్నారు. కాగా, భారతీయ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో నానా పటేకర్ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే కుటుంబ సభ్యులు, సిబ్బంది ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రాణాలను కాపాడలేకపోయారు.
వైద్యుల ప్రకారం.. నానా పటేకర్ తీవ్రమైన గుండెపోటుకు గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఉదయం 5:20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన అనంతరం దాదాపు 45 నిమిషాల పాటు నిరంతరంగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు వైద్య బృందం ప్రయత్నించింది. అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని మణిపాల్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం చీఫ్ డాక్టర్ శేఖర్ సల్కర్ తెలిపారు. ఈ ఘటనపై మెడికో-లీగల్ కేసు కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు. నానా పటేకర్ మరణానికి దారితీసిన పూర్తి పరిస్థితులపై కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా మరింత సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆకస్మిక మరణవార్త బాలీవుడ్‌తో పాటు మరాఠీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.