బెంగళూరు, జూలై 13: నెక్ట్స్ జనరేషన్ ఫ్లెక్సిబుల్ లేదా కర్వ్డ్ డిస్ప్లేస్, టీవీ స్క్రీన్లు, మడత ఫోన్లు, ధరించగలిగే ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి మార్గం సుగమమైంది. వీటి తయారీకి అవసరమైన సూపర్ ఫ్లెక్సిబుల్ కాంపోజిట్ సెమీకండక్టర్ పదార్థాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ప్రస్తుతం ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడుతున్న సంప్రదాయ సెమీ కండక్టర్లకు తగిన మోతాదులో పాలిమర్లను జోడించి సూపర్ ఫ్లెక్సిబుల్ సెమీ కండక్టర్లను తయారుచేశారు. ఇందుకోసం ఫ్లెక్సిబిలిటీని అందించే నీటిలో కరిగే ఇథైల్ సెల్యూలోజ్ పాలిమర్, అద్భుతమైన ఎలక్ట్రానిక్ వాహకత కలిగిన ఇండియమ్ ఆక్సైడ్‌ను వినియోగించారు.