Pakistan Plane: భారత గగనతలంలోకి పాకిస్థాన్ విమానం
పాకిస్తాన్‌కు చెందిన విమానం భారత గగనతలంలో విహరించింది. దాదాపు 10 నిమిషాల పాటు 120కి.మీ మేర భారత గగనతలంలో ప్రయాణించింది. భారీ వర్షం కారణంగా లాహోర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడం కుదరకపోవడం, పైలట్ దారితప్పడంతో ఆ విమానం భారత్‌లోకి ప్రవేశించింది.
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన విమానం భారత గగనతలంలో విహరించింది. దాదాపు 10 నిమిషాల పాటు 120కి.మీ మేర భారత గగనతలంలో ప్రయాణించింది. భారీ వర్షం కారణంగా లాహోర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడం కుదరకపోవడం, పైలట్ దారితప్పడంతో ఆ విమానం భారత్‌లోకి ప్రవేశించింది.
పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్(PIA)కు చెందిన పీకే-248 విమానం మే 4 రాత్రి 8 గంటల సమయంలో మస్కట్ నుంచి పాకిస్థాన్‌కు బయలుదేరింది. లాహోర్ లోని అలామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ భారీ వర్షం కారణంగా అక్కడ దిగేందుకు వీలు కాలేదు. దీంతో చేసేదేం లేక పైలట్ విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో పైలట్ ఆ భారీ వర్షంలో దారి మర్చిపోయాడు. దాదాపు 13,500 అడుగుల ఎత్తులో ఎగురుతూ 292కి.మీ వేగంతో ఆ విమానం భారత గగనతలం(Airspace)లోకి ప్రవేశించింది.
భారత గగనతలంలోకి రాగానే పీకే-248 విమానం దాదాపు 20,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఇలా 7 నిమిషాలు భారత్‌లో ప్రయాణించిన తర్వాత పాక్‌లోకి వెళ్లింది. అయితే కాసేపటికే ఆ విమానం మళ్లీ భారత్‌లోకి ప్రవేశించింది. మళ్లీ ౩ నిమిషాల తర్వాత 8.22గంటలకి 23,000 అడగుల ఎత్తులో ప్రయాణిస్తూ 320కి.మీ వేగంతో పాక్ లోకి వెళ్లిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో నా మీద పోటీ చెయ్.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Negligence | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం..సర్పంచును పక్కనపెట్టి ప్రారంభోత్సవం
సాగర్ నీటి వనరుల పరిరక్షణ, ప్రాజెక్టు భద్రతపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలన
O.M Review | ధనుష్ ‘ఓం’ రివ్యూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే!
Kotha Prabhakar Reddy | సీఎం హుందాతనాన్ని కాపాడుకోవాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

