రాష్ర్టాలు ఒప్పుకొంటే 2029లో జమిలి ఎన్నికలు!
2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు అనేక రాష్ర్టాలలో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఒక దేశం, ఒక ఎన్నికల కింద దీని సాధ్యాసాధ్యాలను సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలిస్తున్నది. ఇప్పటివరకు 25 సమావేశాలను నిర్వహించిన జేపీసీ 10 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రాథమిక పనులను పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిన పక్షంలో 2029లో జమిలి ఎన్నికలను అమలు చేయడం కష్టమేమీ కాదని జేపీసీ చైర్మన్,బీజేపీ ఎంపీ పీపీ చౌదరి తెలిపారు.
- 22 బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ర్టాలు సుముఖం
- బిల్లు ఆమోదం పొందితే ఎన్నికలు సాధ్యమే
- జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు అనేక రాష్ర్టాలలో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఒక దేశం, ఒక ఎన్నికల కింద దీని సాధ్యాసాధ్యాలను సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలిస్తున్నది. ఇప్పటివరకు 25 సమావేశాలను నిర్వహించిన జేపీసీ 10 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రాథమిక పనులను పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిన పక్షంలో 2029లో జమిలి ఎన్నికలను అమలు చేయడం కష్టమేమీ కాదని జేపీసీ చైర్మన్,బీజేపీ ఎంపీ పీపీ చౌదరి తెలిపారు.
2028లో బిల్లు ఆమోదం పొందిన పక్షంలో ఆరు నెలల్లో సన్నాహాలు పూర్తి చేయాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. జమిలి ఎన్నికల ద్వారా రూ.7 లక్షల కోట్లు ఆదా చేయవచ్చని ప్రభుత్వం వాదిస్తున్నది. అయితే, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్‌వై ఖురేషీ అభిప్రాయం ప్రకారం దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది. ఏదైనా మంత్ర దండం ఉంటే తప్ప, ఆ లోపల సాధ్యం కాదు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏకాభిప్రాయ సాధన
జేపీసీలో మొత్తం 41 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 27 మంది లోక్‌సభ ఎంపీలు, 12 మంది రాజ్యసభ ఎంపీలు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. నివేదికను ఎప్పుడు సమర్పిస్తారని ప్రశ్నించగా నిర్దిష్ట కాలపరిమితి ఏమీ లేదు. క్షుణ్ణంగా చర్చించి, కమిటీ సభ్యులు అంగీకరించిన తర్వాతే మేము నివేదికను సమర్పిస్తాము అని చౌదరి అన్నారు. కమిటీ తాను సందర్శించే ప్రతి రాష్ర్టానికి సంబంధించి ఒక సమగ్ర అజెండాను సిద్ధం చేసుకుంటుంది.
కనీసం 500 మంది వ్యక్తులతో సమావేశమవుతుంది. కమిటీ సభ్యులను కలవదలచిన వారికి ముందే సమాచారం అందిస్తారు. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, స్పీకర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులు, ప్రతిపక్ష పార్టీలు, పద్మ భూషణ్ గ్రహీతలు, మీడియా ప్రతినిధులు, పౌర సమాజ సభ్యులు, అసోచామ్, ఫిక్కీ వంటి వ్యాపార సంఘాల ప్రతినిధులు వంటి వారిని కమిటీ కలుసుకుంటుంది.
సమ్మతిస్తే 2029లో ఎన్నికలు
ఏయే రాష్ర్టాలు అంగీకరిస్తున్నాయో, ఏవి అంగీకరించడం లేదో తాము పరిశీలిస్తున్నట్టు చౌదరి చెప్పారు. అంగీకరించిన రాష్ర్టాల శాసనసభల పదవీకాలం ముగిసేలా చేసి 2029లో ఎన్నికలు నిర్వహించేలా చేస్తాము. మిగిలిన రాష్ర్టాలను 2034 నాటికి ఈ నిబంధన పరిధిలోకి తీసుకువస్తాము. అప్పటికి అవి దీనికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది. అవి అంగీకరిస్తే 2029లో లోక్‌సభ, శాసనపభ ఎన్నికలను కలిపి నిర్వహించవచ్చు అని ఆయన తెలిపారు.
22 రాష్ర్టాల్లో బీజేపీ లేదా ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయి. తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల మద్దతును పొందగలమని బీజేపీ ధీమాగా ఉందని, మిగిలిన రాష్ర్టాలను ఒప్పించడం కష్టతరంగా మారుతున్నదని సమాచారం. ఒక అవకాశం ఏమిటంటే 2029 నాటికి బీజేపీ పాలిత 22 రాష్ర్టాలను ఇందులో భాగస్వాములను చేసి మిగిలిన రాష్ర్టాలను 2034లో చేర్చుకోవడం. ఒక దేశం, ఒక ఎన్నికలకు ఉత్తరాఖండ్ మద్దతు ఇస్తున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల, ముఖ్యంగా మారుమూల గ్రామాలకు చేరుకోవడంలో పెద్ద రవాణా సవాళ్లు ఎదురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొన్ని గ్రామాలకు చేరుకోవడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుందని, తిరిగి రావడానికి కూడా అంతే సమయం పడుతుందని, ఎన్నికలను కలిపి నిర్వహించడం ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
కర్ణాటక వ్యతిరేకం
గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం, సీఐఐ, అసోచామ్ వంటి సంస్థలు ఈ ప్రతిపాదనను సమర్థించాయి. మహారాష్ట్ర, హర్యానా, గోవా దీనికి సానుకూలంగా స్పందించాయి. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. పంజాబ్ కూడా ప్రధాన అభ్యంతరాలు ఏవీ వ్యక్తం చేయలేదు. ఈ ప్రతిపాదనను కర్ణాటక వ్యతిరేకించింది. ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్యగా అభివర్ణించిన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇది ఫెడరలిజాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. జమిలి ఎన్నికల వల్ల ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను, అంగన్వాడీ కార్యకర్తలను పదేపదే పంపాల్సిన అవసరం తగ్గుతుందని, తద్వారా వారు తమ సాధారణ విధులపై దృష్టి పెట్టడానికి వీలవుతుందని మద్దతుదారులు భావిస్తున్నారని చౌదరి పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

