Air Quality Index: స్వచ్ఛమైన గాలి పీల్చిన ఢిల్లీ.. జూలైలో 67 ఏక్యూఐ రికార్డు
Air Quality Index: ఢిల్లీ స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నది. సిటీలో చాన్నాళ్ల తర్వాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెరుగుపడింది. జూలై 23వ తేదీన ఆ సిటీలో ఏక్యూఐ 67గా రికార్డు అయ్యింది. వర్షాలు.. గాలుల వల్ల.. ఢిల్లీలో ఆకాశం నిర్మలంగా మారింది.
న్యూఢిల్లీ: వాతావరణంలో మార్పులు.. ఢిల్లీకి ఊరటను తీసుకొచ్చాయి. చాన్నాళ్ల తర్వాత ఢిల్లీలో వాయు నాణ్యత(Air Quality Index) మెరుగుపడింది. ఈ ఏడాది జూలైలో దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యింది. వాయు నాణ్యత సంతృప్తికర కేటగిరీలో నమోదు అయ్యింది. ఢిల్లీలో ఈ కేటగిరీలో ఎయిర్ క్వాలిటీ చూపించడం చాలా అరుదైన విషయం. జూలై 23వ తేదీన సిటీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) కేవలం 67గా నమోదు అయ్యింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం 67 ఏక్యూఐ అనేది సంతృప్తికరమైంది.
సాధారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువ. ఫ్యాక్టరీలు, వాహనాలు, పంట కాలుష్యంతో ఢిల్లీ ఎప్పుడూ సతమతం అవుతుంది. ప్రస్తుతం అక్కడ అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు గాలి కదలికల్లోనూ మార్పు వచ్చింది. దీని వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలులు వీస్తున్నాయి.
అయితే జూలై 25వ తేదీన మళ్లీ ఎయిర్ క్వాలిటీ మాడరేట్ స్థాయిలో చూపించింది. కానీ రెండుమూడు రోజుల పాటు ఆకాశంలో కాలుష్యం తగ్గడం శుభపరిణామంగా భావిస్తున్నారు. క్లీన్ ఎయిర్‌ను పాజిటివ్ సంకేతంగా చూస్తున్నారు. పర్యావరణ, రెగ్యులేటరీ పరిణామాలు.. అర్బన్ ఎయిర్ క్వాలిటీని పెంచినట్లు అధికారులు చెబుతున్నారు.
సీపీసీబీ డేటా ప్రకారం ఢిల్లీలో జూలై 23వ తేదీన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 67గా ఉంది. జూలైలో ఇదే క్లీనెస్ట్ డేగా రికార్డు అయ్యింది. 51 నుంచి 100 మధ్యలో ఏక్యూఐ లెవల్స్ ఉంటే దీన్ని సంతృప్తికరంగా పేర్కొంటున్నారు. దీని వల్ల వాయు సంబంధిత రుగ్మతలు ఉండవని, సాధారణ ప్రజల ఆరోగ్య పరిస్థితి బాగుంటుందని భావిస్తారు.
జూలై 22వ తేదీన ఢిల్లీలో వాయు నాణ్యత 103గా ఉంది. ఇది మోడరేట్ క్యాటగిరీలోకి వస్తుంది. జూలై 24వ తేదీన ఏక్యూఐ .. సంతృప్తికరంగా ఉంది. ఆ రోజు మొత్తం సాటిస్ఫాక్టరీ రేంజ్లో ఉంది. ఉదయం 9 నుంచి రాత్రి ఏడు వరకు … ఏక్యూఐ 76 నుంచి 92 మధ్య ఉంది. ఇక జూలై 25వ తేదీన ఏక్యూఏ.. 128 నుంచి 136 మధ్య రికార్డు అయింది. దీన్ని మాడరేట్ కేటగిరీగా భావిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

