Father rapes teen, Son Films It | యువతిపై వృద్ధుడు లైంగిక దాడి.. రహస్యంగా రికార్డ్ చేసిన కుమారుడు
Father rapes teen, Son Films It | ఒక యువతిపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే తండ్రి చర్యను కుమారుడు రహస్యంగా వీడియో రికార్డు చేశాడు. (Father rapes teen, Son Films It) ఆ వీడియో క్లిప్‌ను యువతి తండ్రికి పంపాడు. యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ: ఒక యువతిపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే తండ్రి చర్యను కుమారుడు రహస్యంగా వీడియో రికార్డు చేశాడు. (Father rapes teen, Son Films It) ఆ వీడియో క్లిప్‌ను యువతి తండ్రికి పంపాడు. యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 68 ఏళ్ల వ్యక్తి పొరుగింటి కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నాడు. వారితో కలిసి పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్లాడు. ఈ నేపథ్యంలో పొరుగింటికి చెందిన 16 ఏళ్ల యువతిని లోబరుచుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 20, 30 మధ్యలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న యువతిని తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాడు.
కాగా, ఆ వృద్ధుడి ఇంట్లోనే 40 ఏళ్ల కుమారుడు తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. తండ్రి, కుమారుడి మధ్య విభేదాలున్నాయి. అలాగే వృద్ధుడైన తండ్రి చేతబడి చేస్తున్నట్లు కుమారుడు అనుమానించాడు. నిఘా పెట్టేందుకు తండ్రి గదిలో రహస్యంగా మొబైల్ ఫోన్ ఉంచాడు. దీంతో యువతిపై తండ్రి అత్యాచారం సంఘటన ఆ మొబైల్ ఫోన్లో రికార్డ్ అయ్యింది.
మరోవైపు తండ్రి అంటే పడని కుమారుడు, ఆ వీడియో క్లిప్‌ను బాధిత యువతి తండ్రి మొబైల్ ఫోన్‌కు పంపాడు. దీంతో యువతి తండ్రి మంగళవారం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తండ్రీ కుమారులను పోలీసులు ప్రశ్నించారు. యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అలాగే రహస్యంగా వీడియో రికార్డ్ చేసి, యువతి తండ్రికి పంపిన వృద్ధుడి కుమారుడిపై కూడా ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిద్దరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని యువతి తండ్రిని బలవంతం చేసిన పొరుగింటికి చెందిన మరో వ్యక్తిపై కూడా సంబంధిత సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. బాధిత యువతికి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు వైద్య పరీక్షల కోసం పంపినట్లు చెప్పారు. జడ్జీ సమక్షంలో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Films
- old age man
- rapes teen
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

