AAP MLA Alleges Poaching Attempt | బీజేపీలో చేరితే ఐదు కోట్లు, లోక్‌సభ సీటు.. ఆప్ ఎమ్మెల్యే ఫిర్యాదుపై కేసు నమోదు
AAP MLA Alleges Poaching Attempt | బీజేపీలో చేరితే ఐదు కోట్లతోపాటు లోక్‌సభ సీటు తనకు ఆఫర్ చేసినట్లు ఆప్ ఎమ్మెల్యే ఆరోపించింది. బీజేపీ కార్యకర్తగా పేర్కొన్న వ్యక్తి ఈ మేరకు తనకు ఫోన్ చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చండీగఢ్: బీజేపీలో చేరితే ఐదు కోట్లతోపాటు లోక్‌సభ సీటు తనకు ఆఫర్ చేసినట్లు ఆప్ ఎమ్మెల్యే ఆరోపించింది. బీజేపీ కార్యకర్తగా పేర్కొన్న వ్యక్తి ఈ మేరకు తనకు ఫోన్ చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (AAP MLA Alleges Poaching Attempt) పంజాబ్‌లోని లూథియానా సౌత్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే రాజిందర్‌పాల్ కౌర్ చీమా, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆప్‌ను వీడాలని తనను ప్రేరేపిస్తున్నారని ఆమె తెలిపింది. బీజేపీ కార్యకర్తగా పేర్కొన్న సేవక్ సింగ్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేశాడని చెప్పింది. బీజేపీలో చేరితే ఐదు కోట్లు ఇస్తామని అతడు ఆఫర్ చేశాడని ఆరోపించింది. ఢిల్లీకి చెందిన తాను బీజేపీ సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి టికెట్ కూడా ఇప్పిస్తానని అతడు హామీ ఇచ్చాడని తెలిపింది.
కాగా, ఆప్ ఎమ్మెల్యే రాజిందర్‌పాల్ కౌర్ చీమా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వీడన్ నంబర్ నుంచి ఆమెకు ఈ ఫోన్ కాల్ వచ్చినట్లుగా తెలుస్తున్నదని పోలీస్ అధికారి వెల్లడించారు.
మరోవైపు సేవక్ సింగ్ అనే వ్యక్తితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పంజాబ్ బీజేపీ ప్రతినిధి జై బన్సాల్ తెలిపారు. ఆప్ ఎమ్మెల్యే ఆరోపణలపై పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

