సోలార్ కారు తయారు చేసిన ఒడిశా రైతు

భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ఒక రైతు సొంతంగా సోలార్ కారును తయారు చేశారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు నడుస్తుందని తెలిపారు. మయూర్భంజ్లోని కరంజియాకు చెందిన సుశీల్ అగర్వాల్, లాక్డౌన్ సమయంలో తన ఇంటి వద్ద సోలార్ కారు తయారికి శ్రీకారం చుట్టారు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, మోటార్ వైండింగ్, ఫ్రేమ్‌లు సహా అన్నింటిని సొంతంగా చేసుకున్నారు. స్నేహితుడి సలహాలు, ఇద్దరు మెకానిక్స్ సహాయంతో మూడు నెలల కిందట దీనిని పూర్తి చేశారు. అయితే ఇంకా ఫ్రేములు బిగించాల్సి ఉన్నది.
కాగా, ఈ సోలార్ కారు బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయ్యేందుకు ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుందని సుశీల్ అగర్వాల్ తెలిపారు. మెల్లగా చార్జ్ అయ్యే ఈ బ్యాటరీ పదేండ్ల పాటు పని చేస్తుందని చెప్పారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు ఈ కారు ప్రయాణిస్తుందని అన్నారు.

లాక్డౌన్ అనంతరం పెట్రోల్ ధరలు పెరుగుతాయని ఊహించానని సుశీల్ చెప్పారు. అందుకే పుస్తకాలు, యూట్యూబ్ ద్వారా తెలుసుకుని సోలార్‌తో నడిచే కారును సొంతంగా తయారు చేసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు ప్రొత్సహించాలని, రోడ్డుపై నడిపేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Built
- Odisha farmer
- Solar Car
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

