Watch: ఇంజిన్ లేకుండానే కదిలిన రైలు.. ఆశ్చర్యపోయిన రైల్వే అధికారులు, జనం
No Engine Train Moves | రైలు ఇంజిన్ లేకుండానే రైలు బోగీలు వేగంగా కదిలాయి. రోడ్డు, రైల్వే క్రాసింగ్‌ను దాటి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. (No Engine Train Moves) స్థానికులు ఇది చూసి నోరెళ్లబెట్టారు. రైల్వే అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రాంచీ: రైలు ఇంజిన్ లేకుండానే రైలు బోగీలు వేగంగా కదిలాయి. రోడ్డు, రైల్వే క్రాసింగ్‌ను దాటి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. (No Engine Train Moves) స్థానికులు ఇది చూసి నోరెళ్లబెట్టారు. రైల్వే అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జార్ఖండ్ సాహిబ్‌గంజ్ జిల్లాలోని మాల్దా రైల్వే డివిజన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. బార్హర్వా రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైళ్లు సరుకులు లోడింగ్, అన్లోడింగ్ చేసే చోట పట్టాలపై ఒక రైల్వే వ్యాగన్, నాలుగు బోగీలు నిలిచి ఉన్నాయి. అయితే రైలు ఇంజిన్ లేని ఆ బోగీలు ఆదివారం ఉన్నట్టుండి పట్టాలపై కదిలాయి. రైలును వెనుకకు నడుపుతున్నట్టుగా చాలా వేగంగా ముందుకు వెళ్లాయి. అక్కడున్న రోడ్డు, రైల్వే క్రాసింగ్‌ను దాటాయి. బార్హర్వా రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని ఆగిపోయాయి.
కాగా, ఇంజిన్ లేకుండానే రైలు బోగీలు కదలడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. రైలు పట్టాలపై వెళ్లిన ఆ రైలు వెంట పరుగులు తీశారు. రైల్వే గేటు వద్ద ఉన్న వారు కూడా ఇది చూసి షాక్ అయ్యారు. ఆ బోగీలు వెళ్లే వరకు జనం, వాహనదారులు ఇరు వైపులా ఉండిపోయారు. రైల్వే అధికారులు కూడా ఇది చూసి నోరెళ్లబెట్టారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైలు బోగీలు వాటికవే ఎలా కదిలాయి అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. డిఘి ప్రధాన మార్గంలో బ్యారియర్స్‌ను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను కోరారు.
మరోవైపు ఆ సమయంలో అక్కడ ఉన్న వారు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా షాకయ్యారు. పలువురు ఫన్నీగా కామెంట్లు చేశారు. ‘ఆత్మనిర్భర్’ రైలు, ఘోస్ట్ రైలు అని కొందరు వ్యాఖ్యానించారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించిందని మరికొందరు పేర్కొన్నారు.
కాగా, ఈ సంఘటనపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆ పట్టాలపై మరో రైలు వచ్చి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా రైల్వే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
https://twitter.com/UtkarshSingh_/status/1698401467638620647?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1698401467638620647%7Ctwgr%5E8f50596d5173fdbde1200d3fc897e1bd0fae0891%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fviral%2Ftrains-moves-without-engine-viral-video-trending-railway-tracks-twitter-post-aatmanirbhar-railway-station-watch-6288395%2F
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

