Nitish Kumar | బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్‌కుమార్.. సామ్రాట్ చౌధరి సీఎం అయ్యే ఛాన్స్
Nitish Kumar | జేడీయూ అధినేత (JDU Chief) నితీశ్ కుమార్ (Nitish Kumar) బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) పదవికి రాజీనామా చేశారు. ఈరోజు లోక్‌భవన్ (Lok Bhavan) చేరుకున్న ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. నితీశ్‌కుమార్ స్థానంలో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Nitish Kumar : జేడీయూ అధినేత (JDU Chief) నితీశ్ కుమార్ (Nitish Kumar) బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) పదవికి రాజీనామా చేశారు. ఈరోజు లోక్‌భవన్ (Lok Bhavan) చేరుకున్న ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. నితీశ్‌కుమార్ స్థానంలో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజీనామాను సమర్పించడానికి ముందు ఆయన మంత్రివర్గ సమావేశాన్ని చివరిసారిగా ఏర్పాటుచేశారు. మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్న విషయాన్ని కేబినెట్ (Cabinet) కు తెలియజేశారు.
నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రెండు దశాబ్దాలు కొనసాగారు. ఇటీవల ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారంచేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా పలువురు బీజేపీ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో తొలిసారి ఆ పార్టీ ఈ పదవిని చేపట్టినట్లవుతుంది. అయితే ఇప్పటివరకు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేంద్ర సహాయమంత్రి నిత్యానందరాయ్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
రాంపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

