IRCTC | రైలు టికెట్ బుకింగ్ ఇక మరింత సులభం.. ఎందుకో తెలుసా..?
IRCTC | రైలు టికెట్ (Rail Ticket) బుక్ చేసుకునేప్పుడు అనవసర క్యాప్చాలు (Captchas) చిరాకు కలిగిస్తుంటాయి. తరచూ వచ్చే పాప్అప్లు (Pop ups) పిచ్చిలేపుతాయి. ఏ క్లాస్‌లో సీట్లు ఉన్నాయో తెలుసుకోవడానికి పదేపదే పేజీలు మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా రైలు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు త్వరలో తెర పడనుంది.
IRCTC : రైలు టికెట్ (Rail Ticket) బుక్ చేసుకునేప్పుడు అనవసర క్యాప్చాలు (Captchas) చిరాకు కలిగిస్తుంటాయి. తరచూ వచ్చే పాప్అప్లు (Pop ups) పిచ్చిలేపుతాయి. ఏ క్లాస్‌లో సీట్లు ఉన్నాయో తెలుసుకోవడానికి పదేపదే పేజీలు మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా రైలు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు త్వరలో తెర పడనుంది. వేగవంతమైన, సులభతరమైన టికెట్ బుకింగ్ (Ticket Booking) విధానం కోసం వెబ్సైట్ (Website) ను ఆధునికీకరిస్తున్నట్లు ఐఆర్సీటీసీ (IRCTC) తెలిపింది. ఈ మేరకు కొత్త బీటా వెర్షన్ (Beta Version) ను తీసుకురానున్నట్లు వెల్లడించింది. మరికొన్ని నెలల్లో పూర్తిస్థాయి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కొన్ని వారాల క్రితం రాజస్థాన్‌లోని మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT) విద్యార్థులు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఉన్న లోపాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఐఆర్సీటీసీ, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అధికారులు ఎంఎన్ఐటీ విద్యార్థులతో ఢిల్లీలో సమావేశమై బీటా వెర్షన్‌ను ప్రదర్శించారు. కొత్త ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను భారతీయ రైల్వేలలోని ప్రయాణికుల రిజర్వేషన్ ఇంజిన్‌తో అనుసంధానం చేస్తున్నారు. బీటా వెర్షన్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా పలు మార్పులు చేశారు. అనవసర క్యాప్చాలు, పాప్అప్లు, మెరుస్తూ ఉండే గ్రాఫిక్స్‌ను తొలగించారు.
దాంతో వెబ్సైట్ వేగంగా పనిచేయడంతోపాటు టికెట్ బుకింగ్ మరింత సులభమవుతుంది. ఒకే స్క్రీన్‌పై అన్ని క్లాసుల్లో సీట్ల లభ్యత కనిపించేలా రూపొందించడంతో ప్రతి క్లాస్‌ను విడివిడిగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. టికెట్ బుకింగ్‌కు అవసరమైన దశల సంఖ్యను కూడా తగ్గించారు. ప్రయాణికుల వివరాలను సేవ్ చేసుకునే అవకాశం కల్పించారు. తరచూ ప్రయాణించేవారు ప్రతిసారీ అవే వివరాలను నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తోపాటు వివిధ రైల్వే టికెట్ బుకింగ్ యాప్‌లకు ఆధారమైన ప్రయాణికుల రిజర్వేషన్ ఇంజిన్‌ను కూడా ఆధునికీకరిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
కొత్త రిజర్వేషన్ వ్యవస్థను త్వరలో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. రైల్వేశాఖ రూపొందించిన రైల్‌వన్ యాప్‌ను ఇప్పటికే 4 కోట్ల మందికిపైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం రైల్వేకు సంబంధించిన అన్ని ప్రధాన సేవలు ఈ యాప్‌లోనే అందుబాటులో ఉంటున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harvester machine | విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ యంత్రం దగ్ధం
Aakasamlo Oka Tara | ‘ఆకాశంలో ఒక తార’ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ ఎలా ఉందంటే!
మండల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు పురస్కారం
Brutal murder | వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

