Noida | తుంటి విరిగిందని ఆసుపత్రికి వెళితే.. గుండె ఆపరేషన్ చేశారు..! పేషంట్ మృతితో వైద్యులపై మండిపడ్డ బంధువులు..!
Noida | తుంటి ఎముక విరిగిందని ఆసుప్రతికి వెళితే వైద్యులు గుండె ఆపరేషన్ చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దాంతో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రోగికి గుండె సంబంధిత సమస్యలున్నాయని ఆసుపత్రి తెలిపింది.
Noida | తుంటి ఎముక విరిగిందని ఆసుప్రతికి వెళితే వైద్యులు గుండె ఆపరేషన్ చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దాంతో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రోగికి గుండె సంబంధిత సమస్యలున్నాయని ఆసుపత్రి తెలిపింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన దినేశ్ కుమార్ సక్సేనా (66) పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. రాజస్థాన్‌లో వైద్యులు సమ్మె చేస్తుండడంతో కుటుంబీకులు నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రికి శనివారం
తరలించారు. మంగళవారం రోగికి యాంజియోగ్రఫీ చేశారు.
తన తండ్రికి గతంలో రెండుసార్లు యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడని మృతుడి కుమారుడు శుభమ్ సక్సేనా తెలిపాడు. బుధవారం ఉదయం వరకు ఆయన పరిస్థితి బాగానే ఉందని, యాంజియోగ్రఫీ చేసిన సందర్భంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని శుభమ్ ఆరోపించారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఐసీయూ చేరుకునే సరికి తన తండ్రి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని, అనుమానం వచ్చి వైద్యులను ప్రశ్నిస్తే 5 గంటల సమయంలో మృతి చెందినట్లు సమాచారం ఇచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆసుపత్రి యాజమాన్యం తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి బంధువులను శాంతింపజేశారు. అయితే, మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులు నిరాకరించారు. ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆసుపత్రి యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. రోగి అప్పటికే గుండె, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని దవాఖాన నిర్వాహకులు తెలిపారు. మృతుడికి షుగర్ ఎక్కువగా ఉందని, తుంటి ఆపరేషన్‌కు ముందు పరిస్థితిని కంట్రోల్ చేయడం అవసరమని పేర్కొన్నారు. రోగికి సంబంధించిన ప్రతి అప్డేట్ను బంధువులకు అందించామని, చికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని తెలిపింది. మృతుడి కుటుంబీకుల ఆరోపణలు నిరాధారమని ఖండించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

