Nabam Tuki | అరుణాచల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నబామ్ టుకీ రాజీనామా.. ఎందుకంటే
Nabam Tuki | అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నబామ్ టుకీ రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో.. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు నబామ్ టుకీ తెలిపారు.
Nabam Tuki: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నబామ్ టుకీ రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో.. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు నబామ్ టుకీ తెలిపారు.
ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఆలిండియా కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి పంపించారు. బీజేపీలో చేరిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా నిలువరించలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నబామ్ టుకీ రాజీనామా చేశారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గ్యామార్ తానా చెప్పారు.
ఈ నెల మొదట్లో సీనియర్ ఎమ్మెల్యే, అరుణాచల్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత లోంబో తాయెంగ్ బీజేపీలో చేరారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఈస్ట్ సియాంగ్ జిల్లాలోని మెబో నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు అంటే ఫిబ్రవరిలో నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లొవాంగ్డాంగ్ కూడా కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి నుంచి అదిరిపోయే అప్డేట్.. షూటింగ్ పూర్తి, త్వరలోనే రాజమౌళి భారీ సర్ప్రైజ్!
Motivational Story | పొలంలో ముల్లు గుచ్చుకుంటే ఆగలేదు.. అడవిలో పాములను చూసి ఎందుకు భయపడ్డాడు?.
Ant Story | ఓ చిన్న చీమ చెప్పిన గొప్ప జీవిత పాఠం.. ఖురాన్లో ప్రస్తావించిన అద్భుత కథ
Karthika Masam | కార్తిక మాసాన్ని హరిహర మాసం అని ఎందుకంటారు? దీపారాధన నుంచి తులసీ పూజ వరకు ప్రతి ఆచారం వెనుక ఉన్న రహస్యం ఇదే!
Bigg Boss 10 | హైపర్ ఆది పంచులతో హౌస్లో నవ్వుల సందడి.. శ్వేత ఎలిమినేట్,అమన్ ఎమోషనల్!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

