Delta Plus: ముంబైలో డెల్టా ప్లస్.. తొలి మరణం నమోదు

ముంబై : డెల్టా ప్లస్ ( Delta Plus ) కోవిడ్ వేరియంట్ వల్ల ముంబైలో ఒకరు మృతిచెందారు. జూలై 27వ తేదీన 63 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. జూలై 21వ తేదీన ఆ వ్యక్తి పాజిటివ్‌గా తేలింది. ఆ పేషెంట్‌కు డయాబెటిస్తో పాటు పలు రకాల రుగ్మతలు ఉన్నాయని అధికారులు చెప్పారు. రెండు డోసుల టీకాలు తీసుకున్న తర్వాత ఆ మహిళకు వైరస్ సోకినట్లు గుర్తించారు. ముంబైలో ఏడు మందికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన విషయం తెలిసిందే. ఆమె నుంచి సేకరించిన జీనోమ్ శ్యాంపిళ్ల సీక్వెన్సింగ్ రిపోర్ట్ బుధవారం వచ్చిది. ఆమెతో సన్నిహత సంబంధం కలిగి ఉన్న మరో ఇద్దరికి డెల్టా ప్లస్ వేరియంట్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అయితే మృతిచెందిన వ్యక్తికి మాత్రం ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు చెప్పారు. ఆ మహిళకు ఆక్సిజన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. స్టిరాయిడ్స్, రెమ్డిసివిర్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. డెల్టా ప్లస్ వేరియంట్ వల్ల మహారాష్ట్రలో ఇప్పటి వరకు ఇద్దరు మృతిచెందారు. గత నెలలో రత్నగిరకి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు ఆ వేరియంట్‌కు బలయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Coronavirus
- delta plus
- Mumbai
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

