కొడుకులపై రిటైర్డ్ పోలీస్ అధికారి కాల్పులు..!
Retired police shoot at sons: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజయ్ మృతిచెందాడు. అతని సోదరుడు సుజయ్‌కి మాత్రం ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

ముంబై: ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తన ఇద్దరు కొడుకులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ కొడుకు మృతి చెందగా.. మరో కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాటిల్ అనే వ్యక్తి ఐరోలి సెక్టార్-2 ప్రాంతంలో నివసిస్తున్నారు. తండ్రితో గొడవల కారణంగా పాటిల్ ఇద్దరు కొడుకులు విజయ్, సుజయ్ వేరుగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం పాటిల్ తన ఇద్దరు కుమారులను ఓ విషయంపై మాట్లాడటానికి తన ఇంటికి పిలిపించారు. కారు బీమా విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో పాటిల్ తన పిస్టల్ తీసుకొని ఇద్దరు కొడుకులపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరినీ కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజయ్ మృతిచెందాడు. అతని సోదరుడు సుజయ్‌కి మాత్రం ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Mum bai
- Retired police
- shoot
- Sons
RELATED ARTICLES
తాజా వార్తలు
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

