రాజస్థాన్‌లో కూలిన మిగ్ -21 బైసన్ విమానం

జైపూర్: భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన మిగ్ -21 బైసన్ విమానం కూలిపోయింది. అయితే అందులోని పైలట్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. రాజస్థాన్‌లోని బార్మర్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. పైలట్ శిక్షణలో ఉండగా సాంకేతిక లోపంతో మిగ్ -21 బైసన్ జెట్ విమానం సాయంత్రం 5.30 గంటలకు కూలినట్లు ఐఏఎఫ్ పేర్కొంది. పైలట్ విమానం నుంచి సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు ట్వీట్ చేసింది.
కాగా, మిగ్ -21 బైసన్ జెట్ యుద్ధ విమానాలు ఈ ఏడాదిలో మరో మూడు కూలిపోయాయి. మే 21న రాత్రి వేళ శిక్షణ కోసం విమానం నడుపుతుండగా పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఒకటి కూలింది. ఈ ప్రమాదంలో స్క్వాడ్రన్ లీడర్ అభినవ్ చౌదరి మరణించారు. మార్చిలో శిక్షణలో భాగంగా మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అవుతుండగా మిగ్ -21 బైసన్ జెట్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మరో పైలట్ చనిపోయారు. ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన మరో మిగ్ -21 బైసన్ యుద్ధ విమానం శ్రీగంగానగర్ జిల్లాలో కూలిపోయింది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

