Methane Gas: కొన్ని నెలల పాటు మీథేన్ లీక్.. ఆ లీకేజీ ఎంతంటే ?
Methane Gas: కజకిస్తాన్‌లో భారీ స్థాయిలో మీథేన్ గ్యాస్ లీకైంది. సుమారు లక్షా 27 వేల టన్నుల గ్యాస్ లీకైనట్లు తెలుస్తోంది. ఆ లీకైన గ్యాస్ వల్ల సుమారు ఏడు లక్షల కార్లు ఏడాది పాటు తిరగవచ్చు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
న్యూఢిల్లీ: కజకిస్తాన్‌లో భారీ స్థాయిలో మీథేన్ గ్యాస్(Methane Gas) లీకైంది. గత ఏడాది ఈ ఘటన జరిగినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. సుమారు లక్షా 27 వేల టన్నుల గ్యాస్ లీకైనట్లు తెలుస్తోంది. సుమారు ఆరు నెలల పాటు ఆ లీకేజీ జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ తరహాలో మీథేన్ కూడా అతి కీలకమైన గ్రీన్‌హౌజ్ గ్యాస్. బుచాచి నెఫ్ట్ అనే కంపెనీ బావి నుంచి ఆ గ్యాస్ లీకైంది. అమెరికా గ్రీన్‌హౌజ్ ఏజెన్సీ ప్రకారం.. ఆ లీకైన గ్యాస్ వల్ల సుమారు ఏడు లక్షల కార్లు ఏడాది పాటు తిరగవచ్చు అని తెలుస్తోంది. ఎన్ని రోజుల పాటు ఏ స్థాయిలో లీక్ జరిగిందన్న దానిపై క్లారిటీ ఇవ్వలేమని, కానీ భారీ స్థాయిలో మీథేన్ లీకైనట్లు యూఎన్ అధికారి తెలిపారు. గత ఏడాది జూన్ 9వ తేదీన మంగిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఓ బావి నుంచి మీథేన్ లీకైంది. డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో జరిగిన విస్పోటనం వల్ల ఆ గ్యాస్ లీకేజీ జరిగింది. అయితే డిసెంబర్ 25వ తేదీ వరకు ఆ లీకేజీ కొనసాగింది. దాని ఆధారంగా భారీ మొత్తంలో మీథేన్ గ్యాస్ లీకై ఉంటుందని భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Errabelli Dayakar Rao | ఎన్నికల్లో ఓటరు నమోదే కీలకం : ఎర్రబెల్లి దయాకర్ రావు
RC 17 | మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్.. ఆర్సీ 17 పూజా కార్యక్రమాలు ఎప్పుడంటే?
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

