బ్లూ డ్రమ్ కేసులో భార్య, ప్రియుడికి మరణ శిక్ష
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, దిగజారుతున్న వైవాహిక విలువలకు ప్రబల ఉదాహరణగా నిలిచిన యూపీ మీరట్‌లోని బ్లూ డ్రమ్ కేసులో భర్తను దారుణంగా హతమార్చిన భార్య, ఆమె ప్రియుడికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఈ కేసులో హతుని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు మరణశిక్ష విధిస్తున్నట్టు జిల్లా, సెషన్స్ జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా బుధవారం తీర్పు చెప్పారు.
- మీరట్ కోర్టు సంచలన తీర్పు
- శిక్ష కూడా ధర్మంలో భాగమేనన్న న్యాయమూర్తి
- మరణ శిక్ష విధించినా పర్వాలేదన్న నిందితురాలి తల్లిదండ్రులు
- కోర్టు ప్రాంగణంలో ప్రజల వేడుకలు
మీరట్, అక్టోబర్ 14: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, దిగజారుతున్న వైవాహిక విలువలకు ప్రబల ఉదాహరణగా నిలిచిన యూపీ మీరట్‌లోని బ్లూ డ్రమ్ కేసులో భర్తను దారుణంగా హతమార్చిన భార్య, ఆమె ప్రియుడికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఈ కేసులో హతుని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు మరణశిక్ష విధిస్తున్నట్టు జిల్లా, సెషన్స్ జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా బుధవారం తీర్పు చెప్పారు. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి మహాభారతాన్ని ఉదహరిస్తూ శిక్ష కూడా ధర్మంలో భాగమేనని పేర్కొన్నారు. నిందితులిద్దరినీ జైలులో నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు.
శిక్ష ప్రకటించినప్పుడు హతుడు సౌరభ్ తల్లి రేణు రాజ్పుట్, అతని సోదరుడు కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. నిందితులకు మరణ శిక్ష పడగానే కోర్టు హాలంతా భారత మాతా కీ జై నినాదాలతో హోరెత్తింది. న్యాయస్థానం, ప్రాంగణంలో పలువురు వేడుకలు చేసుకున్నారు. కేసు వివరాల్లోకి వెళితే.. మర్చంట్ నేవీ అధికారిగా పనిచేస్తున్న సౌరభ్‌ను 2025, మార్చి 3న అతని భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ హత్యచేశారు. తర్వాత అతడి శరీరాన్ని ముక్కలుగా నరికి ఒక బ్లూ డ్రమ్‌లో పెట్టి దానిని సిమెంట్‌తో నింపారు. పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి బ్లూ డ్రమ్‌ను, అందులోని మృతదేహ అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇష్టం లేకపోతే విడిపోండి
పెండ్లయిన తర్వాత తమ జీవిత భాగస్వామి నచ్చకపోతే చట్టాన్ని ఆశ్రయించి విడిపోవాలే తప్ప ఎలాంటి హింసకు పాల్పడవద్దని మృతుని తల్లి దంపతులకు విజ్ఞప్తి చేసింది. ‘మీకు కలిసి ఉండటం ఇష్టం లేకపోతే విడిపోండి, అంతేకాని మీ భాగస్వామిని హతమార్చి వారి తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చొద్దు. మా బిడ్డ భౌతికంగా మాకు దూరమైనా వాడి జ్ఞాపకాలు ఎక్కడికీ పోలేదు. మా ఇంటిలోని అంగుళం అంగుళం అతడి జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి’ అని ఆమె కన్నీటితో పేర్కొన్నారు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడే వారికి మరణ శిక్ష విధించాల్సిందేనన్నారు.
మా అమ్మాయికి ఉరేసినా పర్వాలేదు
అల్లుడిని దారుణంగా హతమార్చిన తమ కుమార్తెకు మరణశిక్ష విధించినా తమకు అభ్యంతరం లేదని ముస్కాన్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు న్యాయస్థానానికి ఒక రాతపూర్వక ప్రకటనను సమర్పించారు. ‘మా అమ్మాయి దారుణమైన తప్పు చేసింది. ఒక వేళ ఆమెకు మరణ శిక్ష విధిస్తే మేం ఎంతమాత్రం వ్యతిరేకించబోం’ అని వారు పేర్కొన్నారు. సౌరభ్ కుటుంబ సభ్యులు కూడా నిందితులకు గరిష్ఠ దండన అయిన మరణ శిక్షను విధించాలని కోరారు.

Blue Drum
రాత్రి నుంచి నిందితుల్లో తీవ్ర ఆందోళన
తీర్పుకు ఒక రోజు ముందు మంగళవారం రాత్రి ముస్కాన్, రస్తోగీలు తీవ్ర ఆందోళనతో గడిపారని, వారు రాత్రంతా నిద్రపోలేదని జైలు వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి వారిద్దరూ అతి కొద్దిగా డిన్నర్ తీసుకున్నారని, బుధవారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను ముట్టలేదని సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేశ్ రాజ్ శర్మ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ సందర్భంగా గతంలో నువ్వేమైనా నేరాలు చేశావా? అని న్యాయమూర్తి సాహిల్‌ను ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని సమాధానం చెప్పాడు.
నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అని ప్రశ్నించగా, ఎలాంటి ప్రకటన చేయడానికి ఇష్టపడలేదు. శిక్ష పడినప్పటి నుంచి ఇద్దరూ తీవ్ర ఆందోళనతో ఉన్నారని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, అవసరమైతే కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మరణ శిక్ష పడిన తర్వాత ముస్కాన్ ప్రవర్తన మారిపోయింది. తోటి ఖైదీలతో మాట్లాడటం మానేసింది. ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నది. ప్రార్థనలోనే ఎక్కువ సమయం గడిపింది. ఇంటివద్ద ఉన్న చిన్న కుమార్తె పట్ల ఆతృత కనబరిచింది. ఆమెను కలుసుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఆమెను కలుసుకోవడానికి ఎవరూ జైలుకు రాలేదని అధికారులు చెప్పారు. కుమార్తెకు ఏమన్నా చెప్పాలనుకుంటే లేఖ రాయవచ్చునని పేర్కొన్న అధికారులు ఆమెకు పేపర్, పెన్ను ఇచ్చారు. దానిని ఆమె చెప్పిన చిరునామాలో అందజేస్తామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

