మైక్రోసాఫ్ట్‌లో మరో 1900 మందిపై వేటు
అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగంలో 1900 మందిని(మొత్తం ఉద్యోగుల్లో 8 శాతం) తొలగించాలని నిర్ణయించింది. గేమింగ్ విభాగంలోని యాక్టివిజన్ బ్లిజార్డ్, ఎక్స్ బాక్స్ డివిజన్లలోనూ కోతలుంటాయని కంపెనీ తెలిపింది.
- సంస్థకు సీనియర్ ఉద్యోగుల గుడ్‌బై
న్యూఢిల్లీ: అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగంలో 1900 మందిని(మొత్తం ఉద్యోగుల్లో 8 శాతం) తొలగించాలని నిర్ణయించింది. గేమింగ్ విభాగంలోని యాక్టివిజన్ బ్లిజార్డ్, ఎక్స్ బాక్స్ డివిజన్లలోనూ కోతలుంటాయని కంపెనీ తెలిపింది. ఇది బాధాకర నిర్ణయమైనా ఆపరేషన్లను క్రమబద్ధీకరించడానికి, కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడానికి ఇది తప్పదని తెలిపింది.
ఇదే సమయంలో కంపెనీలో కీలక పాత్ర పోషించిన బ్లిజార్డ్ అధ్యక్షుడు మైక్ యబ్రా, చీఫ్ డిజైనింగ్ ఆఫీసర్ అల్లెన్ అడమ్ కంపెనీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బ్లిజార్డ్‌కు వచ్చే వారం కొత్త ప్రెసిడెంట్‌ను నియమిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కీలక అధికారులు సంస్థను వీడటం, సంస్థాగత మార్పుల కారణంగా ఒక గేమ్ ప్రాజెక్ట్‌ను బ్లిజార్డ్ రద్దు చేసింది.
సేల్స్ ఫోర్స్‌లో 700 మంది ఇంటికి!
అమెరికాలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ 700 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ శుక్రవారం ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

